
నిజాంసాగర్, (ఎల్లారెడ్డి ) వెలుగు : నిజాంసాగర్ మండల కేంద్రంలోని నిజాంసాగర్ ప్రాజెక్ట్ను ఇరిగేషన్ క్వాలిటీ కంట్రోల్ చీఫ్ ఇంజినీర్ వెంకటకృష్ణ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్వాలిటీ కంట్రోల్ ఇన్స్పెక్షన్లో భాగంగా ప్రాజెక్ట్ను పరిశీలించామన్నారు. అనంతరం మండలంలోని జక్కాపూర్ శివారులోని నాగమడుగు ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించారు. వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో మొదటి దశ పైప్ లైన్ ని ప్రారంభించి పనులు త్వరగా చేపట్టాలని అధికారులకు తెలిపారు.
కార్యక్రమంలో ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్ శ్రీనివాస్, ఎస్ ఈ రాజశేఖర్, ఈఈ సులేమాన్, క్వాలిటీ కంట్రోల్ ఈఈ భూమా రెడ్డి, క్వాలిటీ కంట్రోల్ డీఈ ఈ.దత్తాత్రేయ, ఏఈ శివకుమార్, సాకేత్ తదితరులు పాల్గొన్నారు. ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటిమట్టం 17.802 టీఎంసీలకు గాను ప్రస్తుతానికి 5.474 టీఎంసీల నీరు నిల్వ ఉంది.