- కబ్జాలో కేసీఆర్ ఫ్యామిలీ హస్తం ఉంది: గోనె ప్రకాశ్ రావు
బషీర్ బాగ్, వెలుగు: మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండలం బొమ్రాస్పేట ఎన్ఆర్ఐలకు చెందిన 920 ఎకరాల భూమిపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపించాలని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు డిమాండ్ చేశారు. కేసీఆర్ ఫ్యామిలీకి కూడా ఈ కబ్జాలో హస్తం ఉందని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరణి కమిటీ ఈ వ్యవహారంపై పారదర్శకంగా విచారణ జరపాలన్నారు. హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. బొమ్రాస్పేట గ్రామంలోని సర్వే నంబర్ 323 నుంచి 409 వరకు ఉన్న 1,049 ఎకరాల భూమిలో 920 ఎకరాలు కబ్జా చేశారని ఆరోపించారు.
ఈ భూమి హక్కుదారులంతా విదేశాల్లో సెటిల్ అవ్వడంతో ల్యాండ్‌కు సంబంధించి ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి కొంత మంది కబ్జా చేశారు. కబ్జాదారుల్లో ఎంపీ సంతోష్ రావు, ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రుల మల్లారెడ్డి, ఈటల రాజేందర్ ఉన్నారని ఆరోపించారు. అధికారులు కూడా వీరికి అనుకూలంగా వ్యవహరించారని మండిపడ్డారు. ప్రస్తుతం రేవంత్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరణి కమిటీ కూడా కబ్జాదారులకే వత్తాసు పలుకుతున్నదని ఆరోపించారు.
