తరుగు పేరుతో దోపిడి.. రైస్ మిల్ సిబ్బందిపై సీపీ రంగనాథ్ ఆగ్రహం

తరుగు పేరుతో దోపిడి..  రైస్ మిల్ సిబ్బందిపై సీపీ రంగనాథ్ ఆగ్రహం

రైస్ మిల్ సిబ్బందిపై పోలీస్ కమీషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తరుగుపేరుతో రైతులను దోపిడికి గురిచేస్తున్నారని మండిపడ్డారు. రైస్ మిల్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీపీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. హనుమకొండ జిల్లాలోని కమలాపూర్ మండలం గూడూరులో ధాన్యం కొనుగోలు కేంద్రంలో సీపీ ఏ.వీ. రంగనాథ్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

పంటను అమ్మడానికి ధాన్యం తీసుకువచ్చిన రైతుల సమస్యలను నేరుగా అడిగి తెసులుకున్నారు. తూకం వేసిన తర్వాత రైస్ మిలర్లు ఇచ్చిన రశీదులను ఆయన పరిశీలించారు. కొనుగోలు ప్రక్రియను అడిగి తెసులుకున్నారు. అయితే ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా.. అధిక మొత్తంలో తరుగు పేరుతో రైస్ మిల్లర్లు దోపిడీకి పాల్పడుతున్నారని రైతులు సీపీకి వివరించారు. అటు ముచ్చర్ల నాగారం క్రాస్ రోడ్ లోని సప్తగిరి రైస్ మిల్ పై కూడా పోలీసులు తనిఖీలు నిర్వహించారు.