
- కేజీఎఫ్ సినిమాలో హీరో పాత్ర ప్రభావితం
- ఒకే రోజులో ఒక ప్యాకెట్ సిగరేట్లు
- తీవ్రమైన అనారోగ్యం
- ఆసుపత్రిలో బాలుడికి చికిత్స
- వైద్యుల కౌన్సిలింగ్
ఖైరతాబాద్ : కేజీఎఫ్ (KGF) సినిమాలోని హీరో పాత్ర రాకీభాయ్ లా అవుదామని ఓ పిల్లాడు సిగరెట్లు అలవాటు చేసుకుని ఆస్పత్రి పాలయ్యాడు. టెన్త్ చదువుతున్న ఆ బాలుడు కొద్దిరోజుల్లోనే చైన్ స్మోకర్ గా మారి ఏకంగా గంటకు 20 సిగరెట్లు కాల్చే పరిస్థితికి చేరుకున్నాడు. తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిపాలైన అతనికి డాక్టర్లు ట్రీట్ మెంట్ చేశారు. కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపారు. వివరాల్లోకెళితే.. హైదరాబాద్ రాజేంద్రనగర్ లో నివసించే ఓ బాలుడు (15) పదవ తరగతి చదువుతున్నాడు. ఇటీవల విడుదలైన కేజీఎఫ్2 సినిమా చూశాడు. అందులో హీరో రాకీభాయ్ పాత్రను చూసి చాలా ఇన్ స్పైర్ అయ్యాడు. తాను కూడా రాఖీభాయ్ లా మారాలనుకున్నాడు. దీంతో సిగరెట్ అలవాటు చేసుకున్నాడు.
ఆ అలవాటు కాస్తా తీవ్రంగా మారింది. చైన్ స్మోకింగ్ చెయ్యడం మొదలుపెట్టాడు. చివరకు గంటకు 20 సిగరెట్లు తాగే పరిస్థితికి వచ్చాడు. చివరకు విపరీతమైన దగ్గు, గొంతు నొప్పి, ఆయాసంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో ఆ బాలుడిని తల్లితండ్రులు మే14 న సెంచరీ ఆస్పత్రిలో చేర్పించారు. డాక్టర్లు ట్రీట్ మెంట్ చేసి, కౌన్సిలింగ్ ఇచ్చారు. తాను రాకీభాయ్ లా మారాలనే సిగరెట్లు అలవాటు చేసుకున్నట్లు ఆ బాలుడు కౌన్సిలింగ్ లో చెప్పాడని పల్మనాలజిస్ట్ డాక్టర్ రోహిత్ రెడ్డి వెల్లడించారు. కౌన్సిలింగ్ తర్వాత బాలుడు నెమ్మదిగా కోలుకుంటున్నాడని తల్లిదండ్రులు తెలిపారు.
మరిన్ని వార్తల కోసం : -
ఆర్జీవీపై నిర్మాత నట్టి కుమార్ ఫైర్
‘మేజర్’ సినిమాపై అడివి శేషుతో చిట్ చాట్