అన్ని బీమా పాలసీలూ ఒకేచోట..ఐఆర్డీఏ పబ్లిక్ ఇన్సూరెన్స్ రిజిస్ట్రీ ప్రారంభం

అన్ని బీమా పాలసీలూ ఒకేచోట..ఐఆర్డీఏ పబ్లిక్ ఇన్సూరెన్స్ రిజిస్ట్రీ ప్రారంభం

న్యూఢిల్లీ: భారత బీమా నియంత్రణ సంస్థ (ఐఆర్‌‌డీఏఐ) బీమా రంగంలో పారదర్శకత పెంచడానికి పబ్లిక్ ఇన్సూరెన్స్ రిజిస్ట్రీ (పీఐఆర్), బీమా సుగమ్ అనే రెండు కీలక ప్రాజెక్టులను చేపట్టింది. పీఐఆర్ ద్వారా పాలసీదారులు తమ అన్ని రకాల బీమా వివరాలను ఒకే చోట చూసుకోవచ్చు. 

ప్రస్తుతం వివిధ కంపెనీల వద్ద వేర్వేరుగా ఉన్న డేటాను ఇది ఏకీకృతం చేస్తుంది. దీనివల్ల క్లెయిమ్‌లు పొందడం సులభం అవుతుంది. ఐఆర్‌‌డీఏఐ చైర్మన్ అజయ్ సేథ్ నేతృత్వంలో  ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఈ అంశాలపై చర్చించారు. బీమా సుగమ్ ప్లాట్‌ఫామ్ ద్వారా వినియోగదారులు పాలసీలను పోల్చుకోవచ్చు. 

కొనుగోలు చేయవచ్చు. సైబర్ భద్రత ప్రమాణాలను పాటిస్తూ ఈ డిజిటల్ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నారు.