న్యూఢిల్లీ: భారతదేశంలో సెమీకండక్టర్, కంప్యూట్ ఎకోసిస్టమ్‌ను బలోపేతం చేయడానికి టాటా గ్రూప్, ఇంటెల్ కార్పొరేషన్ చేతులు కలిపాయి. ఒప్పందం ప్రకారం, ఇరు కంపెనీలు బలమైన సప్లయ్ చెయిన్‌ను డెవలప్ చేస్తాయి. లోకల్ అవసరాల కోసం ఇంటెల్ ఉత్పత్తుల తయారీ, ప్యాకేజింగ్‌ను టాటా ఎలక్ట్రానిక్స్ కొత్త ప్లాంట్, ఓసాట్(ఔట్సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్) సౌకర్యాల్లో పరిశీలిస్తారు. అదనంగా, అడ్వాన్స్డ్ ప్యాకేజింగ్‌లో కూడా ఇరు కంపెనీలు కలిసి పనిస్తాయి.
భారతదేశం 2030 నాటికి ప్రపంచంలో టాప్-5 ఏఐ పీసీ మార్కెట్లలో ఒకటిగా ఎదగనుందని అంచనా. ఇంటెల్‌కు చెందిన ఏఐ కంప్యూట్ రిఫరెన్స్ డిజైన్స్, టాటా ఎలక్ట్రానిక్స్ చెందిన ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ సర్వీసెస్ (ఈఎంఎస్) సామర్థ్యాలను ఉపయోగించి కన్జూమర్, ఎంటర్‌ప్రైజ్ ఐఏ పీసీ సొల్యూషన్స్‌ను ఇరు కంపెనీలు అందించనున్నాయి.
