ఇంటర్ బోర్డులో‘ఇంటెలిజెన్స్ ఆరా!

ఇంటర్ బోర్డులో‘ఇంటెలిజెన్స్ ఆరా!

హైదరాబాద్, వెలుగు: ఇంటర్ బోర్డులో జరుగుతున్న వివిధ పనులపై ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీశారు. బుధవారం, గురువారం రెండ్రోజులూ బోర్డులోని అధికారులు, సిబ్బంది నుంచి వివిధ అంశాలకు సంబంధించిన వివరాలను సేకరించినట్టు తెలిసింది. ప్రధానంగా బోర్డులో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు.. కాలేజీలు, పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు,  బోర్డు ఆఫీస్ రినవేషన్ పనుల గురించి ఆరా తీసినట్టు సమాచారం. వివిధ పనులకు ఎంతఖర్చు చేశారు? ఎలా చేశారనే వివరాలను సేకరించారు. దీంతో బోర్డు అధికారుల్లో ఆందోళన మొదలైంది.