బీజేపీ సమావేశాల్లోకి ఇంటలిజెన్స్ పోలీసులు

 బీజేపీ  సమావేశాల్లోకి ఇంటలిజెన్స్ పోలీసులు

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో కలకలం నెలకొంది. సమావేశాల్లోకి నేరుగా ఇంటలిజెన్స్ పోలీసులు వెళ్లడంపై బీజేపీనేతలు అవాక్కయ్యారు. ఇంటలిజెన్స్ శ్రీనివాస్ లోపలికి వెళ్లి.. బీజేపీ తీర్మానాలను సెల్ ఫోన్ లో ఫొటోలు తీసుకున్నారు. దీనిపై అభ్యంతరం చెప్పిన బీజేపీ నేతలు..ఇంటలిజెన్స్ అధికారి శ్రీనివాస్ ను అడ్డుకున్నారు. ఆ తర్వాత అతడిని సీపీ స్టీఫెన్ రవీంద్రకు అప్పగించారు. సిటీ పోలీసుల ముందే సెల్ ఫోన్ లో ఫొటోలను డిలీట్ చేయించారు. అనుమతి లేకుండా లోపలికి ఇంటలిజెన్స్ ఎలా వస్తారని బీజేపీ నేతలు నిలదీశారు.