
హైదరాబాద్, వెలుగు: ఇంటర్ ఎగ్జామ్ ఫీజు గడువును ఇంటర్ బోర్డు మరోసారి పొడిగించింది. ఎలాంటి ఫైన్ లేకుండా ఈ నెల 10 వరకు స్టూడెంట్లు ఫీజు చెల్లించవచ్చని శుక్రవారం ప్రకటించింది. రూ.200 ఫైన్‌తో ఈ నెల 16 దాకా, రూ. వెయ్యి ఫైన్‌తో 23 వరకు, రూ.2 వేల ఫైన్‌తో మార్చి 2 వరకు ఎగ్జామ్ ఫీజు చెల్లించవచ్చని పేర్కొంది.