
హైదరాబాద్, వెలుగు: వెబ్సైట్లో ఎవరి ఆన్సర్ షీట్ వాళ్లకే కనిపించేలా ఇంటర్ బోర్డు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఓపెన్‌గా పెడితే అందరికీ తెలిసి విద్యార్థుల మనోభావాలు దెబ్బతింటాయని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఫెయిలైన 3,82,116 మందికి సంబంధించిన 9,02,429 ఆన్సర్ షీట్లను సోమవారం రాత్రి వెబ్సైట్లో అధికారులు అప్లోడ్ చేశారు. మరో 19 వేల ఆన్సర్‌షీట్లను ఒకట్రెండు రోజుల్లో అప్లోడ్ చేస్తామన్నారు. పాసైన విద్యార్థుల జవాబు పత్రాలను 30న వెబ్సైట్లో పెడతామన్నారు. మంగళవారం సాయంత్రం నాటికి 38 వేల మంది ఆన్సర్‌షీట్లను డౌన్లోడ్ చేసుకున్నట్టు
అధికారులు చెబుతున్నారు. ఫలితాలపై ఆసక్తిగా ఎదురు చూసిన విద్యార్థులు మారిన మార్కులను చూసి, వాటిని డౌన్లోడ్ చేసుకోకుండా వదిలేస్తున్నట్టు సమాచారం. ఆన్సర్‌షీట్లను డౌన్లోడ్ చేసుకునే విధానంపైనా ఇప్పుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సప్లిమెంటరీ పరీక్షల్లోనూ ఫెయిలయ్యానన్న మనస్తాపంతో హైదరాబాద్‌లోని దమ్మాయిగూడకు చెందిన మానస (18) అనే యువతి ఆత్మహత్యాయత్నం చేసింది.