టెన్షన్​ వద్దు ప్రెషర్ పెట్టొద్దు...ఇవాళ్టి నుంచి ఇంటర్, మార్చి 18 నుంచి టెన్త్​ ఎగ్జామ్స్​

టెన్షన్​ వద్దు  ప్రెషర్ పెట్టొద్దు...ఇవాళ్టి నుంచి ఇంటర్, మార్చి 18 నుంచి టెన్త్​ ఎగ్జామ్స్​
  •     పరీక్షల కారణంగా స్టూడెంట్స్​లో పెరగనున్న టెన్షన్, ఒత్తిడి
  •     చదవమంటూ పేరెంట్స్ ప్రెషర్ చేయొద్దంటున్న​సైకాలజిస్టులు
  •     ఒత్తిడికి గురయ్యే విద్యార్థులకు ప్రభుత్వం టెలిమానస్ కౌన్సిలింగ్

హైదరాబాద్, వెలుగు : ఇయ్యాల్టి నుంచి ఇంటర్ ఎగ్జామ్స్​షురూ అవుతుండగా.. సాధారణంగా విద్యార్థులు భయానికి, ప్రెషర్​కు లోనవుతుంటారు. ఇదే టైంలో టీచర్స్​, పేరెంట్స్​కూడా పిల్లలపై ఒత్తిడి పెంచేస్తుంటారు. పరీక్షలకు రెండు మూడు నెలల ముందునుంచే ఎక్స్​ట్రా క్లాసులు, స్లిప్​టెస్టులు, రివిజన్లు ఇలా తీరిక లేకపోవడంతో తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. ఇయ్యాల్టి నుంచి ఇంటర్​, మార్చి 18 నుంచి టెన్త్ ఎగ్జామ్స్​ నేపథ్యంలో విద్యార్థులను ఒత్తిడి చేయొద్దని సైకాలజిస్టులు సూచిస్తున్నారు. అతిగా ఒత్తిడికి గురిచేస్తే  విద్యార్థుల  మానసిక స్థితిపై ఎఫెక్ట్ చూపుతుందని పేర్కొంటున్నారు. మార్కులు ర్యాంకుల కోసం విద్యార్థుల జీవితాలను ప్రమాదంలోకి నెట్టేయొద్దని సూచిస్తున్నారు. విద్యార్థులు కూడా ఎగ్జామ్స్​ అంటే భయపడొద్దంటున్నారు.  ‘‘ఎగ్జామ్స్​ టైమ్ లో పేరెంట్స్​, టీచర్స్​నుంచి తీవ్ర ఒత్తిడి ఉంటుంది. ఇది సరైనది కాదు. ఎక్కువ ఒత్తిడికి లోను చేస్తే  విద్యార్థులు సొంత నిర్ణయాలు తీసుకుంటారు. వారే సొంతంగా టైం టేబుల్‌‌‌‌‌‌‌‌ వేసుకుని చదివే విధంగా ​ప్రోత్సహించాలి ”అని సీనియర్
​సైకాలజిస్ట్​ పేర్కొన్నారు. 

పేరెంట్స్​ సపోర్టు అవసరం 

ఎగ్జామ్స్​ టైమ్​లో పిల్లలకు పేరెంట్స్​నుంచి ఎమోషనల్​సపోర్టు అవసరం ఉంటుందని డాక్టర్లు పేర్కొంటున్నారు. ‘‘ తలనొప్పి, బాడీ పెయిన్స్​, తల తిరగడం, వికారం, మతిమరుపు, భయం, అలసట, చదువుపై ఆసక్తి లేకపోవడం వంటి సమస్యలు కనిపిస్తే.. వాటిపై శ్రద్ధ వహించి, ఒత్తిడిలో ఉన్నారని అర్థం చేసుకోవాలి. వీలైతే సైకాలజిస్ట్, కౌన్సెలర్ వద్దకు తీసుకెళ్లాలి”..అని సైకాలజిస్టులు సూచిస్తున్నారు . 

టెలిమానస్ కౌన్సిలింగ్..

ఎగ్జామ్స్​కారణంగా ఒత్తిడికి గురయ్యే విద్యార్థులకు ప్రభుత్వం సైకాలజిస్టులతో టెలిమానస్​ కౌన్సిలింగ్ ​ను ఏర్పాటు చేసింది. దీనికి ప్రత్యేకంగా 14416, 1800914416 టోల్​ఫ్రీ నంబర్​ను అందుబాటులోకి తెచ్చింది. 24 గంటలు అందుబాటులో ఉంటుంది. కాల్ చేసి విద్యార్థులు, పేరెంట్స్​అవసరమైన కౌన్సిలింగ్​పొందవచ్చు. ‘‘ ప్రస్తుతం రోజూ పదుల సంఖ్యలో కాల్స్ వస్తున్నాయి.  పరీక్షల సమయంలో  కాల్స్​సంఖ్య పెరుగుతుంది. ఎక్కువగా పేరెంట్స్​కాల్ చేస్తున్నారు’’ అని  టెలిమానస్​అధికారి తెలిపారు. 

ప్లానింగ్ తో చదివితే ఈజీ

ప్లానింగ్ తో చదివితే ఎగ్జామ్స్​ఈజీగా రాయొచ్చు. ప్రతి సబ్జెక్ట్​కు పర్టిక్యులర్​ టైమ్​కేటాయించాలి. టఫ్ సబ్జెక్ట్స్​ను ఎక్కువసార్లు రివిజన్ చేస్తే సరిపోతుంది.  ఆహారపు అలవాట్లు కూడా మార్చుకోవాలి. సాయంత్రం 7 గంటల్లోపే డిన్నర్​ ముగించాలి. వాటర్​ఎక్కువగా తాగాలి. ఫోన్​,టీవీకి దూరంగాఉండాలి. పేరెంట్స్ కూడా చదువుకునే వాతావరణం కల్పించాలి. సరిగా నిద్రపోయేలా చూడాలి. 

.– డాక్టర్ ఎం.ఎ.కరీం, సీనియర్​ సైకాలజిస్ట్