షురువైన ఇంటర్ పరీక్షలు

షురువైన ఇంటర్ పరీక్షలు
  •  తొలిరోజు 19,641 మంది ఆబ్సెంట్ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు బుధవారం ఫస్టియర్ స్టూడెంట్లకు సెకండ్ లాంగ్వేజీ పేపర్ పరీక్ష జరిగింది. మొత్తం 5,07,754 మంది రాయాల్సి ఉండగా.. 4,88,113 మంది హాజరయ్యారు. 19,641 (3.86%) మంది అటెండ్ కాలేదు. నిజామాబాద్, కరీంనగర్, జనగామ జిల్లాల్లో ఒక్కో మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేసినట్టు ఇంటర్ బోర్డు సెక్రటరీ శృతిఓజా తెలిపారు. 

పరీక్షా కేంద్రాలకు స్టూడెంట్లు పేరెంట్స్ తో కలిసి వచ్చారు. కొన్ని సెంటర్ల వద్ద సౌలతులు సరిగ్గా లేకపోవడంతో స్టూడెంట్లు ఇబ్బంది పడ్డారు.  నిర్ణీత టైమ్​ కంటే ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను పలు ప్రాంతాల్లో అనుమతించలేదు. కాగా, తొలిరోజు పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని అధికారులు ప్రకటించారు.