ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు.. నవంబర్ 1నుంచి ఆన్ లైన్ లో ఫీజు చెల్లింపు

ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు.. నవంబర్ 1నుంచి ఆన్ లైన్ లో ఫీజు చెల్లింపు

హైదరాబాద్: వచ్చే ఏడాది ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ప్రతి రోజు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.  నవంబర్​ 1 నుంచి నుంచి నవంబర్ 11 వరకు ఆన్ లైన్ ద్వారా విద్యార్థులు పరీక్ష ఫీజులు చెల్లించుకోవచ్చు.

ఫిబ్రవరి 25 న ఇంటర్ ఫస్ట్ ఈయర్.. 26 న ఇంటర్ సెకెండ్ ఈయర్ పరీక్షలు ప్రారంభమవుతాయి. గతం కంటే ఈసారి ముందుగానే ఇంటర్​ పరీక్షలు  నిర్వహిస్తున్నారు. థియరీ ఎగ్జామ్స్​ ముందు ఫిబ్రవరి 2 నుంచి  ఇంటర్ ప్రాక్టీకల్ పరీక్షలు జరగనున్నాయి. 
 
ఐఐటీ, ఎప్ సెట్​,నీట్ వంటి పరీక్షలకు ఇబ్బంది లేకుండా ముందుగానే పరీక్షలు నిర్వహిస్తున్నట్లు  ఇంటర్ బోర్డు ప్రకటించింది.  నవంబర్​ 1 నుంచి నుంచి నవంబర్ 11 వరకు ఆన్ లైన్ ద్వారా విద్యార్థులు పరీక్ష ఫీజులు చెల్లించుకోవచ్చు. అపరాధ రుసుము (లేట్​ ఫీ) 2 వేలతో డిసెంబర్ 15 వరకు ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లించవచ్చు. 

వచ్చే విద్యాసంవత్సరం నుంచి పరీక్షల విధానంలో భారీ సంస్కరణలు తీసుకొస్తున్నట్టు తెలిపారు.  శనివారం  హైదరాబాద్​ నాంపల్లిలోని ఇంటర్ బోర్డు ఆఫీసులో ఎగ్జామినేషన్ కంట్రోలర్ జయప్రదబాయితో కలిసి మీడియాతో మాట్లాడారు. వచ్చే విద్యాసంవత్సరంలో ఇంటర్‌‌‌‌‌‌‌‌లోని అన్ని సబ్జెక్టుల సిలబస్‌‌‌‌లో మార్పులు చేస్తున్నట్టు  చెప్పారు. 

మ్యాథ్స్, ఫిజిక్స్, బాటనీ, జువాలజీ తదితర సబ్జెక్టులను 2013–14లో మార్చినట్టు వెల్లడించారు. 2019లో హ్యుమానిటీస్, 2021లో ఫస్ట్ లాంగ్వేజీ , 2018లో సెకండ్ లాంగ్వేజీ, 2020లో తెలుగు సబ్జెక్టు   సిలబస్‌‌‌‌లో మార్పులు చేసినట్టు తెలిపారు. 

ఎన్​సీఈఆర్టీ  నిబంధనలకు తగ్గట్టుగా మళ్లీ వచ్చే విద్యాసంవత్సరంలో అన్ని సబ్జెక్టుల సిలబస్‌‌‌‌లో​ మార్పులు చేస్తున్నామని వివరించారు. సబ్జెక్ట్ ఎక్స్‌‌‌‌పర్ట్​ల ద్వారా 40 రోజుల్లోనే ఈ ప్రక్రియను పూర్తిచేస్తామన్నారు.