విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఇంటర్​ పాసైతే చాలు ఇంజనీరింగ్‌లో చేరొచ్చు

విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఇంటర్​ పాసైతే చాలు ఇంజనీరింగ్‌లో చేరొచ్చు

ఇంటర్‌తో ఎంసెట్​ కౌన్సెలింగ్​కు ఎలిజిబుల్​

ఈ ఏడాదికే మినహాయింపులిస్తూ ఉత్తర్వులిచ్చిన రాష్ట్ర సర్కార్​

ఎంసెట్​కు కనీస అర్హతలను సర్కార్ సడలించింది. ఎంసెట్​కు క్వాలిఫై కావాలంటే ఇంటర్​లో కనీసం 45శాతం మార్కులు ఉండాలనే రూల్​ను ఈ ఏడాది ఎత్తేస్తూ జీవో జారీ చేసింది. ఎంసెట్​లో క్వాలిఫై అయి, ఇంటర్​లో 35 శాతం మార్కులు వచ్చినోళ్లకు కూడా దీంతో లాభం చేకూరనుంది. ఇట్లాంటి స్టూడెంట్లు ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగంలో 333 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వారందరికీ త్వరలోనే ర్యాంకులు కేటాయించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఎంసెట్​కు క్వాలిఫై కావాలంటే ఇంటర్​లో ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్​కు సంబంధిత సబ్జెక్టులో 40 శాతం, మిగిలిన స్టూడెంట్స్​కు 45 శాతం మార్కులు రావాలనే రూల్ ఉంది. ఇక ఓపెన్ స్కూల్ స్టూడెంట్లను అన్ని ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ కు అర్హులుగా పరిగణించాలని సర్కార్ మరో జీవో జారీ చేసింది.

హైదరాబాద్, వెలుగు: ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన టీఎస్​ఎంసెట్ కనీస అర్హతలను ప్రభుత్వం సడలించింది. ఎంసెట్ కు క్వాలిఫై కావాలంటే ఇంటర్ లో 45శాతం మార్కులు ఉండాలనే నిబంధనను ఎత్తేసింది. కరోనా నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పెషల్ చీఫ్ సెక్రటరీ చిత్రారాంచంద్రన్ తెలిపారు. ఈ మేరకు గురువారం జీవో నెంబర్ 201ని రిలీజ్ చేశారు. ఈ మినహాయింపు ఈ ఒక్క ఏడాదికి మాత్రమే వర్తిస్తుందని చెప్పారు. సర్కార్ ఆర్డర్ మేరకు ఎంసెట్ మార్కులు, ఇంటర్ మార్కుల ఆధారంగా అర్హత సాధించిన స్టూడెంట్స్​కు  త్వరలోనే ర్యాంకులు కేటాయిస్తామని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్ చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 4.11 లక్షల మంది ఇంటర్ సెకండియర్ ఎగ్జామ్స్ రాయగా.. వారిలో ఎంపీసీ, బైపీసీ స్టూడెంట్లు 2,83,631 మంది ఉన్నారు. వీరిలో 1.75 లక్షల మంది పాసయ్యారు. కాగా కరోనా కారణంగా సర్కార్ అడ్వాన్స్​డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ పెట్టలేదు. ఫెయిల్ అయిన స్టూడెంట్స్ అందరికీ మినిమమ్ క్వాలిఫయింగ్ మార్కులు వేసి పాస్ చేసింది.

క్యాండిడేట్లు కోర్టుకు వెళ్లడంతో…

ఎంసెట్ ఇంజనీరింగ్ స్ర్టీమ్ ఎగ్జామ్ కు 1,19,183 మంది స్టూడెంట్స్ హాజరైతే… వారిలో 89,734 మంది క్వాలిఫై అయ్యారు. అయితే ఎంసెట్ కు ఇంటర్ క్వాలిఫయింగ్ మార్కుల అంశాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్​కు సంబంధిత సబ్జెక్టులో 40 శాతం, మిగిలిన స్టూడెంట్స్​కు 45 శాతం మార్కులు ఉంటేనే.. వాళ్లు ఎంసెట్ కు అర్హులు. అయితే సప్లిమెంటరీ లేకపోవడంతో, మినిమమ్ పాస్ మార్కులతో పాసైన స్టూడెంట్లు క్వాలిఫయింగ్ మార్కుల నిబంధనను ఎత్తేయ్యాలని డిమాండ్ చేశారు. కానీ టెక్నికల్ ఎడ్యుకేషన్​ గానీ, ఉన్నత విద్యామండలి గానీ పట్టించుకోలేదు. దీంతో కొందరు హైకోర్టును ఆశ్రయించారు. సమస్య పెద్దది అవుతోందని భావించిన సర్కారు.. క్వాలిఫయింగ్ మార్కుల ఉత్తర్వులు సవరిస్తామని బుధవారం కోర్టుకు విన్నవించింది. దీంతో అప్పటి వరకు రెండో విడత కౌన్సెలింగ్ ఆపాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఇంటర్ క్వాలిఫయింగ్ మార్కుల అంశాన్ని ఎంసెట్​అడ్మిషన్ల ప్రక్రియలో పక్కనపెడుతూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఎంసెట్ ఎగ్జామ్​లో క్వాలిఫై మార్కులు సాధించి, ఇంటర్ లో తక్కువ మార్కులు రావడం వల్ల ర్యాంకులు పొందనోళ్లకు ప్రయోజనం చేకూరనుంది. ఇప్పుడు వారంతా కౌన్సెలింగ్​కు అర్హత సాధించారు.

333 మందికి లబ్ధి…

సర్కార్ ఇచ్చిన జీవో ప్రకారం ఎంసెట్ ఎగ్జామ్​లో క్వాలిఫై మార్కులు సాధించి, ఇంటర్ లో మార్కులు తక్కువ రావడంతో ఇంజనీరింగ్ విభాగంలో ర్యాంకులు పొందని స్టూడెంట్లు 330 మంది ఉన్నట్టు అధికారులు గుర్తించారు. వీరిలో 313 మంది ఇంటర్ బోర్డు స్టూడెంట్స్​కాగా, మరో 20 మంది ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా పాసైనోళ్లు ఉన్నారు. ఇంటర్​లో క్వాలిఫయింగ్ మార్కులు లేక ర్యాంకులు పొందని స్టూడెంట్స్ తమను సంప్రదిస్తే, ర్యాంకులు కేటాయించనున్నట్టు అధికారులు చెప్పారు.

‘ఓపెన్’ స్టూడెంట్స్​అన్ని సెట్లకూ అర్హులే.. 

కరోనా ఎఫెక్ట్​తో ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా పరీక్ష రాసేందుకు ఫీజు కట్టిన 30,733 మంది స్టూడెంట్స్​అందరినీ ఈ ఏడాది మినిమమ్ (35 శాతం) మార్కులతో పాస్ చేశారు. దీంతో వారంతా ఎంసెట్, లాసెట్ సహా వివిధ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ కు అర్హత కోల్పోయారు. దీంతో సొసైటీ అధికారులతో కమిటీ వేసింది. ఆ కమిటీ సిఫార్సుల మేరకు ఓపెన్ స్టూడెంట్స్​కు వచ్చిన మార్కులను అన్ని పరీక్షలకు క్వాలిఫై మార్కులుగా పరిగణించాలని స్పెషల్ సీఎస్​ చిత్రారాంచంద్రన్ జీవో నెంబర్ 17 రిలీజ్ చేశారు.

ఇయ్యాల్టి నుంచి ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్

ఎంసెట్ ఇంజనీరింగ్ అడ్మిషన్స్​ఫైనల్ ఫేజ్​కౌన్సెలింగ్ శుక్రవారం నుంచి మొదలవుతుందని టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. వచ్చే నెల 2 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చన్నారు. ఇంటర్​లో తక్కువ మార్కులు వచ్చిన స్టూడెంట్స్, ఓపెన్ స్కూల్ సొసైటీ స్టూడెంట్స్ ఈ నెల 31న ఆన్​లైన్​లో వివరాలు నింపాలి. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకోవాలి. వారికి వచ్చే నెల 1న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది. ఆప్షన్లు ఇచ్చిన స్టూడెంట్లకు నవంబర్ 4న సీట్లు కేటాయిస్తారు. సీట్లు పొందిన స్టూడెంట్స్​7లోగా ట్యూషన్ ఫీజు చెల్లించి సెల్ఫ్​రిపోర్టింగ్ చేయాలని మిట్టల్‌‌ కోరారు.

For More News..

కుక్కను వాకింగ్‌కు తీసుకెళ్తే రూ. 29 లక్షల జీతం