
తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థుల రీవెరిఫికేషన్ ఫలితాలు ఈ నెల 10వ తేదీలోగా ప్రకటించనున్నట్లు తెలిపింది ఇంటర్ బోర్టు. ఆ తర్వాత 15 రోజుల్లోగా స్కాన్ చేసిన ఆన్సర్ పేపర్లను ఆన్‌లైన్‌లో ఉంచనున్నట్లు తెలిపింది. విద్యార్థుల ఆన్సర్ పేపర్లు డౌన్‌లోడ్ చేసుకునేందుకు వీలుగా వెబ్‌సైట్‌లో పెడుతున్నట్టు చెప్పింది. రీవెరిఫికేషన్ తర్వాత పెరిగిన మార్కులు, అంతకుముందు వచ్చిన మార్కులు స్పష్టం గా తెలుపుతామని ఇంటర్‌బోర్డు కార్యదర్శి అశోక్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 12 ఎవాల్యుషన్ కేంద్రాల్లో అనుభవజ్ఞులైన అధ్యాపకులతో రీవెరిఫికేషన్ ప్రక్రియ జరుపుతున్నామని, దీనిపై ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని సూచించారు బోర్డు అధికారులు.