Vastu Tips: బెడ్ రూంలో అద్దం ఎక్కడ ఉండాలి.. నేలపై పడుకుంటే నష్టాలు వస్తాయా..!

Vastu Tips: బెడ్ రూంలో అద్దం ఎక్కడ ఉండాలి.. నేలపై పడుకుంటే నష్టాలు వస్తాయా..!

దాదాపు అందరి బెడ్ రూమ్స్ లో అద్దం .. డ్రస్సింగ్ టేబుల్స్ ఉంటాయి.  వాస్తు ప్రకారం బెడ్ రూంలో ఇవి ఎక్కడ ఉండాలి.. బెడ్ రూంలో నేలపై పడుకుంటే నష్టాలు కలుగుతాయా.. వాస్తు ప్రకారం పాటించాల్సిన పద్దతుల గురించి  వాస్తుకన్సల్టెంట్  కాశీనాథుని శ్రీనివాస్  సలహాలను ఒకసారి పరిశీలిద్దాం. . .. .

ప్రశ్న: మాస్టర్ బెడ్ రూంలో  అద్దం  ఏ వైపు  ఉండాలి?

జవాబు : బెడ్ రూంలో  ఆగ్నేయం లేదా వాయువ్యం దిశలో అద్దం.. . డ్రెస్సింగ్ టేబుల్ ఏర్పాటు చేసుకుంటే మంచిదని వాస్తుకన్సల్టెంట్  కాశీనాథుని శ్రీనివాస్  అంటున్నారు .

ప్రశ్న: నైరుతి వైపు బెడ్ రూమ్ లో  నేలమీద పడుకోవచ్చా?

జవాబు : ఇది మాస్టర్ బెడ్ రూమ్...  నేలమీద పడుకోవడంలో ఎలాంటి దోషం లేదు. బెడ్ పైనే పడుకోవాలనే రూల్ ఏమీ లేదు. అయితే బెడ్ సరైన దిశలో ఏర్పాటు చేసుకోవాలి. గాలి, వెలుతురు సరిగ్గా వచ్చేలా గది ఏర్పాటు ఉండాలని వాస్తుకన్సల్టెంట్  కాశీనాథుని శ్రీనివాస్ సూచిస్తున్నారు.