
UPI Not Free: దేశంలో ప్రజల అవసరాల కోసం చెల్లింపు మాధ్యమంగా ఉపయోగించే కరెన్సీని ముద్రించటం నిర్వహించటం వంటి పనులను రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా చూసుకుంటోంది. అయితే ఆధునిక యుగంలో వచ్చిన డిజిటల్ చెల్లింపులతో డిజిటల్ రూపంలో చెల్లింపులు పెరిగాయి. ప్రధానంగా యూపీఐ భౌతికంగా డబ్బు వినియోగాన్ని భారీగా తగ్గించింది. భౌతిక కరెన్సీ అదనపు ఖర్చులు కూడా ఉండవు.
అయితే దేశంలో భారీగా ప్రజాధరణ పొందిన యూపీఐ చెల్లింపులు ప్రస్తుతానికి మాత్రం ఫ్రీగానే అనుమతించబడుతున్నాయి. కానీ డిజిటల్ చెల్లింపులు ఉచితంగా కొనసాగించటం జీవితాతం కుదరదని రిజర్వు బ్యాంక్ సూచనలు ఇస్తోంది. యూపీఐ చెల్లింపులు ఎలాంటి అదనపు ఖర్చులు లేకుండా కొనసాగటం త్వరలోనే ముగుస్తుందని రిజర్వు బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా చెప్పటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. యూపీఐ వినియోగం భారీగా పెరగటంతో వ్యవస్థను ఆర్థికంగా స్థిరంగా ఉంచటం ముఖ్యమన్నారు.
ALSO READ : Suzlon Stock: పడిపోతున్న సుజ్లాన్ స్టాక్.. ఇన్వెస్టర్లకు నిపుణుల సూచన ఇదే..
UPI చెల్లింపుల విధానం ప్రస్తుతం ఎటువంటి యూజర్ ఛార్జీలు లేకుండా నడుస్తుండగా.. ఈ డిజిటల్ పేమెంట్ వ్యవస్థను ఉచితంగా ఉంచడానికి ప్రభుత్వం బ్యాంకులు, ఇతర చెల్లింపు భాగస్వాములకు సబ్సిడీ ఇస్తోందన్నారు మల్హోత్రా. దేశంలో ప్రజలకు సురక్షితమైన డిజిటల్ చెల్లింపులను అందించాలనే నిబద్ధత దృఢంగా ఉన్నప్పటికీ.. దీర్ఘకాలిక స్థిరత్వాన్ని పక్కన పెట్టడం కుదరదని మల్హోత్రా నొక్కిచెప్పారు. దీనికి ఎవరో ఒకరు ఖర్చులను భరించాల్సి ఉంటుందని.. ఖర్చులను చెల్లించాల్సి వస్తుందని అన్నారు.
కేవలం రెండేళ్లలోనే రోజువారీ యూపీఐ చెల్లింపుల సంఖ్య 60 కోట్లకు చేరుకున్నాయి. దీనికి కారణం యూపీఐపై ఎలాంటి అదనపు చెల్లింపు ఛార్జీలు లేకపోవటమే. ప్రస్తుతం చెల్లింపులపై జీరో మర్చంట్ డిస్కౌంట్ రేటు విధానం అమలులో ఉండా దీనిని ఇలాగే కొనసాగించాలా లేక యూపీఐ పేమెంట్స్ పై ఛార్జీలు విధించాలా అనే నిర్ణయం అంతిమంగా ప్రభుత్వం చేతిలోనే ఉంటుందని మల్హోత్రా అన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వాలు మారితే డిజిటల్ పేమెంట్స్ ఉచితంగా ఇవ్వాలా వద్దా అనే నిర్ణయం వారిపైనే ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది. ఫ్రీ యూపీఐ పేమెంట్స్ నిలిపివేస్తే ప్రజలు కూడా తిరిగి భౌతిక కరెన్సీ వాడకానికి తిరిగా రావొచ్చనే అంచనాలు ఉన్నాయి.