Suzlon Stock: పడిపోతున్న సుజ్లాన్ స్టాక్.. ఇన్వెస్టర్లకు నిపుణుల సూచన ఇదే..

Suzlon Stock: పడిపోతున్న సుజ్లాన్ స్టాక్.. ఇన్వెస్టర్లకు నిపుణుల సూచన ఇదే..

Suzlon Energy Shares: ప్రపంచ వ్యాప్తంగా రెన్యూవబుల్ ఎనర్జీ వైపు అడుగులు సోలార్, విండ్ ఎనర్జీ సంస్థలకు కొత్త వ్యాపార అవకాశాలను తెచ్చిపెడుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ విండ్ ఎనర్జీ సంస్థ సుజ్లాన్ భారీగా ఆర్డర్లను అందుకుంది. దీంతో పెట్టుబడిదారులు కంపెనీ షేర్లపై భారీగా బెట్టింగ్ వేస్తూ వస్తున్నారు కొన్ని నెలలుగా. 

అయితే ప్రస్తుతం మార్కెట్లో సుజ్లాన్ ఎనర్జీ కంపెనీ షేర్లు నిరంతరం తగ్గుదలను చూస్తున్నాయి. శుక్రవారం స్టాక్ ఒక్కోటి రూ.63.63 రేటు వద్ద ప్రయాణాన్ని ముగించిన సంగతి తెలిసిందే. అయితే ఇది ఖచ్చితంగా ఇన్వెస్టర్లు అప్రమత్తం అవ్వాల్సిన సమయం అని అంటున్నారు మార్కెట్ నిపుణులు. జూన్ మాసంలో పెట్టుబడిదారులు లాభాల బుక్కింగ్ కోసం వెల్లడం షేర్లను పతనం దిశగా ప్రేరేపించింది.

దేశీయ బ్రోకరేజ్ సంస్థ రెలిగేర్ నిపుణుడు రవి సింగ్ స్టాక్ సాంకేతికంగా బలహీనంగా ఉన్నట్లు చెప్పారు. షేరు ధర ఒక్కోటి రూ.62 స్థాయికి పడిపోవచ్చని వెల్లడించారు. ఇక ఆనంద్ రాఠీ బ్రోకింగ్ నిపుణులు జిగర్ ఎస్ పటేల్ స్టాక్ సమీప రోజుల్లో రూ.62 నుంచి రూ.68 రేటు మధ్య ట్రేడింగ్ కొనసాగించవచ్చని అంచనాలను పంచుకున్నారు. 

►ALSO READ | ఐటీ ఉద్యోగులకు బుధవారం వర్క్ ఫ్రం హోం : బెంగళూరులో ఎందుకీ ప్రయోగం..!

జూలై 21న మద్రాస్ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులో.. CGST, సెంట్రల్ ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ మునుపటి ఆదేశాలను రద్దు చేసిందని సుజ్లాన్ ఎనర్జీ ఇటీవల స్టాక్ మార్కెట్లకు కంపెనీ వెల్లడించింది. 20-21 ఆర్థిక సంవత్సరం నుండి 22 ఆర్థిక సంవత్సరం వరకు GST దాఖలులో అధిక లేదా అనర్హమైన ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ ఉందనే ఆరోపణలపై కోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చినట్లు సుజ్లాన్ వెల్లడించింది. 

NOTE: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటి ఆధారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోల్లో పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకోవటానికి ముందుగా మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించటం ఉత్తమం. మీరు తీసుకునే నిర్ణయాలకు V6 యాజమాన్యం లేదా ఉద్యోగులు ఎట్టిపరిస్థితుల్లోనూ బాధ్యత వహించరు.