Vastu Tips:ఈశాన్యంలో రాళ్ల దిబ్బలు ఉండచ్చా.. రెండు సింహద్వారాలుంటే ఎక్కడ ఉండాలి..

Vastu Tips:ఈశాన్యంలో రాళ్ల దిబ్బలు ఉండచ్చా.. రెండు సింహద్వారాలుంటే ఎక్కడ ఉండాలి..

ఆర్థిక స్థోమతను బట్టి చాలామంది అపార్ట్ మెంట్ కంటే.. ఇండివిడ్యుయల్ హౌస్ లకే ప్రాధాన్యత ఇస్తారు.  సాధారణంగా ఇంటికి ఈశాన్యంలో ఖాళీ ఉండాలని చెబుతున్నారు.. కాని అక్కడ ఎత్తుగా  మట్టి దిబ్బలు.. రాళ్లు ఉంటే వాస్తు ప్రకారం వచ్చే ఇబ్బందులు ఏమిటి.. అలాగే ఇంటికి రెండు సింహద్వారాలు పెట్టాలనుకుంటే ఏఏ దిక్కులో పెట్టుకోవాలి.. మొదలగు ప్రశ్నలకు వాస్తుకన్సల్టెంట్  కాశీనాథుని శ్రీనివాస్ ఏం చెబుతున్నారో తెలుసుకుందాం. . .

ప్రశ్న:మా ఇంటికి ఈశాన్య దిక్కులో చిన్న గుట్టలాగా ఎత్తులో రాళ్లు, మట్టిదిబ్బలు ఉన్నాయి. ఇలా ఉండడం వాస్తుపరంగా ఏమైనా దోషమా?

జవాబు: ఈశాన్యం దిక్కు ఈశ్వరుడి స్థానం. అందువల్ల ఈశాన్యలలో బరువు ఉండకూడదని వాస్తు శాస్త్రం చెప్తాంది. వాస్తు ప్రకారం ఈశాన్యం (తూర్పు-ఉత్తరం)లో బరువు ఉంటే అభివృద్ధిపై ప్రభావం చూపుతుంది. ఇంటికి ఎంత దూరంలో రాళ్లు, దెబ్బలు ఉన్నాయనే దాన్నిబట్టి ఆ ప్రభావం ఉంటుందని వాస్తుకన్సల్టెంట్  కాశీనాథుని శ్రీనివాస్  చెబుతున్నారు. 

 

ప్రశ్న: ఇంటికీ రెండు ద్వారాలు పెట్టాలనుకుంటున్నాం. ఎలా ఉండాలి? ఏ వైపు ఏ ద్వారం(  సింహద్వారం) ఉండాలి?

జవాబు: ఇంటికి నాలుగు దిక్కులా ఏమేం ఉన్నాయి.. రోడ్ ఫేసింగ్ ను బట్టి ద్వారాల విషయంలో
నిర్ణయం తీసుకోవాలి. తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యంలో ప్రధానద్వారాలు ఏర్పాటు చేసుకుంటే మంచిది. దక్షిణంవైపు ఫేసింగ్ ఉంటే, దక్షిణ సెంటర్లో ఏర్పాటు చేసుకోవాలి. ఉత్తరం, తూర్పు వైపు కూడా మంచిదని వాస్తుకన్సల్టెంట్  కాశీనాథుని శ్రీనివాస్  సూచిస్తున్నారు.