చౌటుప్పల్ నేషనల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు ఏపీ డీఎస్పీలు స్పాట్ డెడ్

చౌటుప్పల్ నేషనల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు ఏపీ డీఎస్పీలు స్పాట్ డెడ్

యాదాద్రి భువనగిరి జిల్లా: చౌటుప్పల్ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆంధ్రాకు చెందిన ఆంధ్రా సెక్యూరిటీ వింగ్ స్కార్పియో అదుపు తప్పి డివైడర్ను ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో ఆంధ్రాకు చెందిన ఇద్దరు డీఎస్పీలు చక్రధర్ రావు, శాంతారావు అక్కడిక్కడే మృతి చెందారు.

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఖైతాపురం జాతీయ రహదారి వద్ద ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు కూడా తీవ్రంగా గాయపడ్డారు. అడిషనల్ ఎస్పీ ప్రసాద్, డ్రైవర్ నర్సింగ్ రావుకు తీవ్ర గాయాలయ్యాయి. 

మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కామినేని హాస్పిటల్కు క్షతగాత్రులను పోలీసులు తరలించారు. ఈ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన డీఎస్పీలు చక్రధర్ రావు, శాంతారావు ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్లో పనిచేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు.