
రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్(ఆర్వీఎన్ఎల్) మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ ఆగస్టు 13.
- పోస్టుల సంఖ్య: 12
- పోస్టులు: డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఐటీ అండ్ ఎస్ అండ్ టీ/ బీడీ) 02, మేనేజర్ (ఎస్ అండ్ టీ) 05, డిప్యూటీ మేనేజర్ (ఎన్ అండ్ టీ) 05.
- ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ విభాగంలో బి.టెక్/ బీఈ, పీజీ, డిప్లొమా ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
- వయోపరిమితి: డిప్యూటీ జనరల్ మేనేజర్‌కు 45 ఏండ్లు, మేనేజర్‌కు 40 ఏండ్లు, డిప్యూటీ మేనేజర్‌కు 35 ఏండ్లు ఉండాలి.
- అప్లికేషన్: ఆఫ్‌లైన్ ద్వారా. డిస్పాచ్ సెక్షన్, గ్రౌండ్ ఫ్లోర్, ఆగస్ట్ క్రాంతి భవన్, భికాజీ కామా ప్లేస్, ఆర్ కేపురం, న్యూఢిల్లీ–110066 చిరునామాకు అప్లికేషన్ పంపించాలి.
- లాస్ట్ డేట్: ఆగస్టు 13.
- అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.400. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఫీజు లేదు.
- సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
- పూర్తి వివరాలకు rvnl.org వెబ్సైట్లో సంప్రదించగలరు.