హీరోను చెప్పుతో కొట్టిన నటి.. మ్యాటర్ అంతదూరం ఎందుకు వెళ్లిందంటే?

హీరోను చెప్పుతో కొట్టిన నటి.. మ్యాటర్ అంతదూరం ఎందుకు వెళ్లిందంటే?

ముంబెలోని ఓ సినీపోలీస్ థియేటర్ లో  ' సో లాంగ్ వ్యాలీ '  సినిమా ప్రదర్శన జరుగుతుండగా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.  నటుడు, నిర్మాత మాన్ సింగ్ ను నటి రుచి గుజ్జర్ చెప్పుతో కొట్టింది. దీంతో ఒక్కసారిగా అక్కడ గందరగోళం నెలకొంది. ఈ ఘనటకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  రుచికి, మరో నిర్మాత కరణ్ సింగ్ చౌహాన్‌ కొనసాగుతున్న  ఆర్థిక వివాదం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుందని తెలుస్తోంది.

 

వైరల్ అవుతున్న ఈ వీడియోలో నిర్మాతలతో రుచి వాగ్వాదానికి దిగుతూ కేకలు వేయడం స్పష్టంగా వినిసిస్తుంది.  ఆ తర్వాత ఆమె సహనాన్ని కోల్పోయి నిర్మాతలలో ఒకరిని తన చెప్పుతో కొట్టింది.  ఈ ఘటనకు ముందు నుంచే ఆమె నిరసన తెలపాలని థియేటర్ కు వచ్చినట్లు తెలుస్తోంది. '  సో లాంగ్ వ్యాలీ ' సినిమా ప్రత్యేక ప్రదర్శన జరుగుతున్నప్పుడు రుచి నిరసనకారులతో కలిసి థియేటర్ కు వచ్చింది.  ఆమెతో వచ్చిన వారు నిర్మాతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ALSO READ : Sonu Sood : ఫిష్ వెంక‌ట్ కుటుంబానికి సోనూ సూద్ ఆర్థిక సహాయం.. అండగా ఉంటానని హామీ!

త్వరలో సోని టీవీలో ప్రసారం కానున్న హిందీ సీరియల్ ను నిర్మిస్తున్నానని చౌహాన్ గతంలో తనను సంప్రదించాడని రుచి తెలిపింది.  ఈ సీరియల్ లో తనను సహనిర్మాతగా చేర్చుకుంటానని చెప్పారు. ఇది నమ్మి  జూలై 2023, జనవరి 2024 లో తన సంస్థ ఎస్ ఆర్ ఈవెంట్ అండ్ ఎంటర్టైన్మెంట్ నుంచి చౌహన్ స్టూడియోకు సంబంధించిన ఖాతాలకు విడత వారిగా చెల్లింపులు చేశాను. కానీ ఇచ్చిన హామీ అమలు చేయకుండా మోసం చేశారని పోలీసులకు రుచి ఫిర్యాదు చేసింది. ఎన్నిసార్లు సంప్రదించినా వాయిదాలు వేస్తూ అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించింది. 

తాను ఇచ్చిన నగదును సీరియల్ కోసం కాకుండా 'సో లాంగ్ వ్యాలీ'కి నిర్మాణానికి ఉపయోగించనట్లు గుర్తించానని ఆమె వెల్లడించింది. తన డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తుంటే..  బెదిరిస్తున్నారని రుచి ఆరోపించింది. ఇద్దరి మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పత్రాలను పోలీసులకు ఇచ్చినట్లు చెప్పారు.  దీంతో  రూ.. 25 లక్షలు మోసం చేశారన్న ఆరోపణలపై చౌహాన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. .