11 నుంచి ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్!

11 నుంచి ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్!

హైదరాబాద్, వెలుగు: సర్కారు ఆదేశాలతో ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ ను ప్రారంభించేందుకు ఇంటర్ బోర్డు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ నెల11 లేదా 12న వాల్యుయేషన్ స్టార్ట్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొదట సెకండియర్ పేపర్ల‌ను దిద్దించాలని, ఆ తర్వాత ఫస్టియర్ ఆన్సర్ షీట్లను వాల్యువేషన్ చేయాలని నిర్ణ‌యించారు. జాతీయ స్థాయి పోటీ పరీక్షలు, డిగ్రీ అడ్మిషన్లకు లింక్ ఉండడంతో ముందు సెకండియర్ పేపర్లు దిద్ది, రిజల్ట్స్ ఇవ్వాలని డెసిషన్ తీసుకున్నారు. అంతా అనుకున్నట్టు జరిగితే జూన్ సెకండ్ వీక్ లో ఫలితాలు విడుదల చేయనున్నట్టు అధికారులు చెబుతున్నారు. అదే నెల15 నుంచి లాంగ్వేజెస్, 19 నుంచి ఆప్షనల్ సబ్జె
క్ట్ పేప‌ర్ల వాల్యుయేషన్ ప్రారంభమైనా, లాక్ డౌన్ తో ఆగిపోయింది.

దిద్దాల్సినవి 55 లక్షలు

రాష్ట్ర‌వ్యాప్తంగా ఫస్టియర్, సెకండియర్ స్టూడెంట్లకు సంబంధించి మొత్తం 65 లక్షల వరకు పేపర్లు ఉన్నాయి. వీటిలో ఇంకా 55 లక్షల పేపర్ల‌ను వాల్యుయేషన్ చేయాల్సి ఉంది. ముందుగా తక్కువ మందితో ఆన్సర్ షీట్ల కోడింగ్ ను పూర్తి చేసి, ఆ తర్వాత దిద్దడం ప్రారంభించాలని అధికారులు నిర్ణ‌యించారు. 12 స్పాట్ సెంటర్లలో గురువారం నుంచి నాలుగైదు రోజుల ఈ ప్రాసెస్ చేస్తామని తెలిపారు. ఆ తర్వాత ఈ నెల 11 లేదా 12 నుంచి వాల్యుయేషన్ స్టార్ట్ చేయనున్నారు. ఒక్కో రోజు ఒక్కొక్కరితో 45 పేపర్ల‌ను దిద్దించాలని భావిస్తున్నారు. సిబ్బంది, సెంటర్ల సంఖ్య పెంపు ప్రస్తుతం స్టేట్ లో 12 స్పాట్ సెంటర్లు, వీటికి అనుబంధంగా మరో 21 సబ్ సెంటర్ల‌ను అధికారులు గుర్తించారు. మరిన్ని సబ్ సెంటరను చూడాలని డీఐఈ ఓలకు బోర్డు అధికారులు ఆదేశాలిచ్చారు. సిబ్బంది సంఖ్యను భారీగా పెంచాలని నిర్ణ‌యించారు. స్పాట్ సెంటర్ల‌ శానిటైజ్ చేస్తూ, ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోంటామన్నారు. ప్రస్తుతం ఒకేషనల్ పేపర్లు దిద్దేందుకు హైదరాబాద్ లోనే సెంటర్ ఉంది. లాక్ డౌన్ నేపథ్యంలో వరంగల్, నల్లగొండ జిల్లాల్లోనూ పెట్టాలని భావిస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో అధికారికంగా నిర్ణ‌యం తీసుకోనున్నారు.

ట్రాన్స్ పోర్టు, హాస్టల్ ఫెసిలిటీ

వాల్యుయేషన్ కు లెక్చరర్లు జిల్లా కేంద్రాలకు రావడం ఇబ్బందిగా మారనుంది. దీంతో వారిని స్పాట్ సెంటర్ల‌కు తరలించేందుకు ట్రాన్స్ పోర్టు సౌకర్యం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దూర ప్రాంతాల్లో ఉన్న వారి కోసం బస్సులు పెట్టాలని భావిస్తున్నారు. సొంత వెహికల్స్ వచ్చే వారికి పాస్ లు ఇప్పించాలని నిర్ణ‌యించారు. ఒకవేళ అక్కడే ఉండాలని లెక్చరర్లు భావిస్తే, వారికోసం ప్రత్యేకంగా హాస్టల్ ఫెసిలిటీ కల్పించేందుకూ రెడీ అయ్యారు. నెలన్నరలో వాల్యుయేషన్ పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.