ఇంటర్ లో సబ్జెక్ట్ ఫెయిల్ : స్టూడెంట్ ఆత్మహత్య

ఇంటర్ లో సబ్జెక్ట్ ఫెయిల్ : స్టూడెంట్ ఆత్మహత్య

హైదరాబాద్ : ఇంటర్మీడియట్ లో ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయ్యానని ఓ స్టూడెంట్ ఆత్మహత్య కు పాల్పడ్డాడు. ఈ సంఘటన హైదరాబాద్ కుషాయిగూడ పోలిస్టేషన్ పరిధిలో జరిగింది. కాప్రా ఏఎస్ రావు నగర్ లో నివసించే డి.నాగరాజు అనే యువకుడు ECIL లోని నారాయణ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుండేవాడు. గురువారం విడుదలైన పరీక్ష ఫలితాల్లో… నాగరాజు ఓ సబ్జెక్టులో ఫెయిల్ అయ్యాడు. సబ్జెక్ట్ ఎలా తప్పిందంటూ తల్లిదండ్రులు విద్యార్థిని మందలించారు.

ఆవేదనకు లోనైన నాగరాజు బెడ్ రూమ్ లో చీరతో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే నాగరాజును దింపి.. స్థానిక హాస్పిటల్ కు తీసుకెళ్లారు. పరిశీలించిన డాక్టర్లు అప్పటికే నాగరాజు మృతి చెందాడని నిర్ధారించారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు..ఆవేశంలో ప్రాణం తీసుకున్నాడంటూ ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా ఏడ్చారు. హాస్పిటల్ లోనూ.. వారి ఉంటున్న ఏరియాలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి.

విద్యార్థులను మందలించొద్దు : పోలీసులు

బాధితులు పోలీసులకు కంప్లైంట్ చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మార్కులు తక్కువొచ్చినా… సబ్జెక్ట్ ఫెయిలైనా విద్యార్థులను మందలించవద్దని.. వారికి ఎన్నో అవకాశాలు ఉంటాయని నచ్చజెప్పి ప్రోత్సహించాలని పోలీసులు తల్లిదండ్రులకు సూచించారు.