ప్రతి చిన్న విషయానికి పిల్లలు హర్ట్ అవుతున్నారు. తల్లిదండ్రులు కొద్దిగా మందలిస్తే చాలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు తాజాగా ఓ ఇంటర్ విద్యార్థిని ఫోన్ ఎక్కువుగా వాడుతుందని ఇన్ స్ట్రాగ్రామ్ లో ఛాటింగ్ చేస్తుందని తన తల్లి మందలించింది. దీంతో మనస్థాపం చెందిన ఆ విద్యార్థిని మాదాపూర్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై నుండి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన చోటు చేసుకుంది, కాలేజీకి వెళ్తున్నానని చెప్పి.. ఇంటికి రాకపోయేసరికి విద్యార్థిని తల్లి కళాశాల యాజమాన్యానికి తెలియపరిచింది. దీంతో కేపిహెచ్బీ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కంప్లయింట్ ఇచ్చారు. ఫోన్ ట్రాక్ చేసిన పోలీసులు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ఉన్నట్లు గుర్తించి మాదాపూర్ పోలీసులకు ..KPHB పోలీసులకు సమాచారం అందించారు. చెరువులో దూకిన విద్యార్ధిని రెస్క్యూ చేసిన మాదాపూర్,దుర్గం చెరువు లేక్ పోలీసులు కాపాడారు. ప్రస్తుతం విద్యార్థిని ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
