తుమ్మలపల్లి సమీపంలోని బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేయాలి

తుమ్మలపల్లి సమీపంలోని బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేయాలి

కొణిజర్ల, వెలుగు: ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తుమ్మలపల్లి సమీపంలోని పగిడేరు వాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను వెంటనే పూర్తి చేయాలని బీఆర్​ఎస్​ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు డిమాండ్​ చేశారు. శనివారం నిలిచిపోయిన లెవెల్​ బ్రిడ్జి పనులను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ దశాబ్దాలుగా వర్షాకాలంలో పగిడేరు వాగు పొంగిపొర్లడం వల్ల ఈ ప్రాంత రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, స్థానిక ఎమ్మెల్యే బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేయించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. అదేవిధంగా కాంగ్రెస్​ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో బీఆర్​ఎస్​ నాయకులు తదితరులు పాల్గొన్నారు.