వరంగల్ ఏనుమాముల మార్కెట్కు పెరిగిన మామిడి రాక

వరంగల్ ఏనుమాముల మార్కెట్కు పెరిగిన మామిడి రాక

గ్రేటర్ వరంగల్, వెలుగు: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్​కు ఈ ఏడాది మామిడి రాక పెరిగినట్లు మార్కెట్​ కమిటీ చైర్​పర్సన్​ ప్రియాంక, మామిడికాయల సూపర్​వైజర్​ తెలిపారు. ఈ సంవత్సరం పూత ఆలస్యం కావడంతో ఎప్పుడూ మార్చిలోనే వచ్చే మామిడికాయలు ఈ సారి ఆలస్యంగా మార్కెట్​కు వస్తున్నాయి. గతేడాది 10,246 టన్నులు రాగా, ప్రస్తుతం ఇప్పటి వరకు 11,464 టన్నుల మామిడి కాయలు వచ్చినట్లు పేర్కొన్నారు. 

కాగా, టన్నుకు సుమారు రూ.60 వేలు గరిష్టంగా పలుకుతున్నా, కనిష్టంగా రూ.40వేల నుంచి రూ.25వేల లోపు మాత్రమే వ్యాపారస్తులు ధర నిర్ణయిస్తున్నారని మామిడి రైతులు చెబుతున్నారు. మార్కెట్ పాలకవర్గం చొరవ తీసుకుని ధరలు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.