మే 24న ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్

మే 24న ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్

తెలంగాణలో ఇంటర్ రిజల్ట్ ను రిలీజ్ చేశారు  విద్యాశాఖ సెక్రటరీ బుర్రావెంకటేశం.  ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండియర్ రిజల్ట్ ఒకేసారి రిలీజ్ చేశారు. ఈ సారి అమ్మాయిలు పైచేయి సాధించారు. ఫస్టియర్ ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో టాప్ లోనిలవగా..సెకండియర్ రిజల్ట్ లో ములుగు జిల్లా అత్యధిక ఉత్తీర్ణతతో ఫస్ట్ ప్లేసులో నిలిచింది.  ఫస్ట్ ఇయర్ లో 60.01 సెకండియర్ లో 64.19 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇక  మే 24 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  ఏప్రిల్ 25 నుంచి మే 2 వరకు  రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు

 రాష్ట్రంలో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు  జరిగాయి.  ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు 9 లక్షల 80 వేల 978 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో.. ఇంటర్ ఫస్ట్ ఇయర్ కు 4 లక్షల 78 వేల 527 మంది కాగా.. సెకండ్ ఇయర్ లో 4 లక్షల 43 వేల 993 మంది విద్యార్ధులు ఎగ్జామ్స్ రాశారు. వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి 92 వేల 800 స్టూడెంట్స్ ఉన్నారు.