ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు రిలీజ్

ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు రిలీజ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇంటర్ అడ్వాన్స్​డ్​ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఫస్టియర్ లో 63.86%, సెకండియర్​లో 43.77% మంది పాసయ్యారు. సోమవారం సెక్రటేరియెట్​లో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్ర వెంకటేశం ఫలితాలను రిలీజ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా  మే 24 నుంచి జూన్ 3 వరకు పరీక్షలు జరిగాయి.

 ఫస్టియర్​లో 2,54,498 మంది పరీక్షలకు అటెండ్ కాగా, వారిలో 1,62,520 మంది పాసయ్యారు. దీంట్లో ఇంప్రూవ్ మెంట్ రాసిన వాళ్లు 1,06,484 మంది ఉండగా, నాన్ ఇంప్రూవ్ మెంట్ విద్యార్థులు 56,036 మంది ఉన్నారు. ఒకేషనల్​లో 18,913 మంది పరీక్ష రాయగా, 10,070 మంది ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్​లో 1,38,477 మంది స్టూడెంట్లు ఎగ్జామ్స్ రాయగా, 60,615 మంది పాసయ్యారు. 

ఒకేషనల్​లో 15,136 మంది పరీక్షలు రాయగా 7,737 మంది పాసయ్యారు. ఫస్టియర్ పాస్ పర్సంటేజీలో ములుగు జిల్లా 85.29%తో టాప్​లో ఉండగా, కామారెడ్డి జిల్లా 44.38%తో చివరి స్థానంలో ఉంది. సెకండియర్​లోనూ ములుగు జిల్లా 81.47శాతంతో మొదటి స్థానంలో ఉండగా, వికారాబాద్ జిల్లా 29.59 శాతంతో చివరి స్థానంలో నిలిచింది. ఫలితాలను  https://tgbie.cgg.gov.in లేదా  https://results.cgg.gov.in​లో చూడొచ్చని అధికారులు ప్రకటించారు. విద్యార్థులు వెబ్ సైట్ నుంచి మెమో డౌన్ లోడ్ చేసుకోవచ్చని వెల్లడించారు. ఈ నెల 25 నుంచి 29 వరకు విద్యార్థులు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.