
హైదరాబాద్, వెలుగు: ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు ఈ నెల 14న విడుదల కానున్నట్లు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం ట్వీట్ చేశారు. విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ ఈ విషయం చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. రిజల్ట్ ఆలస్యంతో స్టూడెంట్స్ ఐఐటీ, నీట్‌లో సీట్లు కోల్పోయే ప్రమాదముందన్న ట్వీట్‌కు ఆయన స్పందించారు. జూన్ 7 నుంచి 14 వరకు తెలంగాణలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు మొత్తం 4,63,236 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా వారిలో ఫస్టియర్ విద్యార్థులు 3,00,847 మంది, సెకండియర్ విద్యార్థులు 1,62,389 మంది విద్యార్థులు ఉన్నారు. పరీక్షలు పూర్తయి నెలరోజులు కావొస్తున్నా, ఫలితాలు ఇవ్వకపోవడంపై పేరెంట్స్, స్టూడెంట్స్ ఆందోళన చెందుతున్నారు.