రామకృష్ణాపూర్​లో ఎంపీ వంశీకృష్ణ ఫొటోకు క్షీరాభిషేకం

రామకృష్ణాపూర్​లో ఎంపీ వంశీకృష్ణ ఫొటోకు క్షీరాభిషేకం

కోల్​బెల్ట్, వెలుగు: సింగరేణి రిటైర్డ్ కార్మికులకు కనీసం రూ.10 వేలు పెన్షన్​అమలు చేయాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఇటీవల పార్లమెంట్ లో ప్రస్తావించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆయన ఫొటోకు  సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులు శనివారం క్షీరాభిషేకం చేశారు. రామకృష్ణాపూర్​లోని రాజీవ్​ చౌక్​వద్ద సింగరేణి రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ప్రెసిడెంట్​ కుమ్మరి మల్లయ్య ఆధ్వర్యంలో ఎంపీ ఫొటోకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. తక్కువ పెన్షన్​కారణంగా తాము పడుతున్న ఇబ్బందులను ఎన్నికల ప్రచారం సందర్భంగా వంశీకృష్ణ దృష్టికి తీసుకవెళ్లామన్నారు. 

ఆయన ఎంపీ అయిన వెంటనే పార్లమెంట్​లో తమ సమస్యలు, ఇబ్బందులను ప్రస్తావించడంతో పాటు కనీస పెన్షన్​ రూ.10వేల ఇవ్వాలని డిమాండ్​ చేశారన్నారు. సింగరేణి రిటైర్డ్ ఉద్యోగుల హక్కులు, డిమాండ్ల కోసం వంశీకృష్ణ కొట్లాడుతున్నారని, ఆయన చొరవ కారణంగా ఇటీవల పెన్షన్​ నిధికి రూ.140కోట్లను జమ చేశారన్నారు. ఎంపీ పోరాటం వల్ల తమకు  పెన్షన్​ పెరుగుతుందని భావిస్తున్నామని పెర్కోన్నారు. రిటైర్డ్ కార్మికులు సాతి శంకరయ్య, మెరుగు బాలయ్య తదితరులు పాల్గొన్నారు.