ఆసిఫాబాద్​ జిల్లాలో మూడు హనుమాన్ ​ఆలయాల్లో చోరీలు

ఆసిఫాబాద్​ జిల్లాలో మూడు హనుమాన్ ​ఆలయాల్లో చోరీలు

కాగజ్ నగర్, వెలుగు: ఆసిఫాబాద్​ జిల్లాలోని మూడు హనుమాన్​ఆలయాల్లో చోరీలు జరిగాయి. కాగజ్‌నగర్‌ పట్టణంలోని కాపువాడలో పంచముఖ అంజనేయ గుడి తాళాలను శుక్రవారం రాత్రి గుర్తుతెలియయని వ్యక్తులు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. స్వామి వారి వెండి హారం, హుండిలో నగదు దోచుకె ళ్లారు. కాగజ్‌నగర్‌ మండలంలోని భట్​పల్లి హనుమాన్ టెంపుల్​లోకి చొరబడి వెండి ఆభరణాలు, హుండీలోని డబ్బులు చోరీ చేశారు. ఓకే రోజు రాత్రి పట్టణంతో పాటు పక్కనే ఉన్న రెండు ఆలయాలలో చోరీలు జరగడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

బోర్లకుంట ఆలయంలో.. 

దహెగాం, వెలుగు: దహెగాం మండలం బోర్లకుంటలోని హనుమాన్ ఆలయ తాళాలను శుక్రవారం రాత్రి పగులగొట్టి 12 తులాల వెండి కిరీటం,1.5 గ్రాముల బంగారు పుస్తెల తాడు ఎత్తుకెళ్లారు. ఉదయం పూజారి వెళ్లిచూడగా విషయం బయటపడింది. సమాచారం అందుకున్న ఎస్సై కందూరి రాజు గుడి వద్దకు చేరుకొని పరిశీలించారు. పూజారి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.