తిర్యాణిలో లైబ్రరీగా మారిన పోలీస్​స్టేషన్

తిర్యాణిలో లైబ్రరీగా మారిన పోలీస్​స్టేషన్

తిర్యాణి, వెలుగు: ఒక్క పుస్తకం వందమంది స్నేహితులతో సమానమని, యువత ఉన్నత స్థాయికి ఎదగాలంటే లైబ్రరీలో పుస్తకాలతో స్నేహం చేయాలని ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్ అన్నారు. తిర్యాణి పాత పోలీస్ స్టేషన్​ను లైబ్రరీగా మార్చగా శనివారం ఏఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక యువతను ఉద్దేశించి మాట్లాడారు. ఈమధ్య యువత పుస్తకాలను దూరం పెడుతూ సెల్ ఫోన్​కు దగ్గరై విలువైన కాలాన్ని వృథా చేసుకుంటున్నారని అన్నారు. 

గతంలో మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతమైన తిర్యాణిలో తుపాకులు భద్రపరచిన  పోలీస్ స్టేషన్​ను  ఇప్పుడు లైబ్రరీగా మార్చామని దీన్ని సద్విని యోగం చేసుకోవాలని కోరారు. గ్రంథాలయం ఏర్పాటులో చొరవ చూపిన రెబ్బెన సీఐ బుద్దె స్వామి, స్థానిక ఎస్సై శ్రీకాంత్, సిబ్బందిని ఏఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో  ఆదివాసీ సంఘాల నాయకులు కుర్సెంగ మోతీరామ్, నర్సింగ్ రావు, రవీందర్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.