
- పాత రేట్లనే కొనసాగించిన ప్రభుత్వం
న్యూఢిల్లీ : స్మాల్ సేవింగ్స్ స్కీమ్‌లపై ఇస్తున్న వడ్డీని ఈ ఏడాది జనవరి–మార్చి క్వార్టర్‌కు గాను ప్రభుత్వం మార్చలేదని ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్ చేసింది. నేషనల్ సేవింగ్ రికరింగ్ డిపాజిట్ అకౌంట్ (ఆర్‌డీ) ఆఫర్ చేస్తున్న వడ్డీ రేటు ఏడాదికి 6.7 శాతంగా ఉంది. ఈ స్కీమ్‌ను చిన్న ఇన్వెస్టర్ల కోసం తీసుకొచ్చారు. కనీసం రూ.100 ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎల్లప్పుడూ రూ.1,000 మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ ఏడాదికి 7.1 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది. ప్రతి ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.500, గరిష్టంగా రూ.1.50 లక్షలు ఇన్వెస్ట్ చేయొచ్చు.
సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ స్కీమ్ ఏడాదికి 8.2 శాతం వడ్డీ ఇస్తోంది. కనీసం రూ.1,000, గరిష్టంగా రూ.30 లక్షలు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ స్కీమ్ ద్వారా వచ్చే వడ్డీ ఆదాయం ఆర్థిక సంవత్సరంలో రూ.50 వేల పైన ఉంటే ట్యాక్స్ పడుతుంది. పోస్ట్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ ఏడాదికి 7.4 శాతం వడ్డీ ఆఫర్ చేస్తుండగా, ఈ స్కీమ్ అకౌంట్‌ను కనీసం డిపాజిట్ రూ.1,000 తో ఓపెన్ చేయాలి. సింగిల్ అకౌంట్‌లో గరిష్టంగా రూ.9 లక్షలు, జాయింట్ అకౌంట్ అయితే గరిష్టంగా రూ.15 లక్షలు ఇన్వెస్ట్ చేయడానికి వీలుంటుంది.
ఒక వ్యక్తికి ఎన్ని అకౌంట్లు ఉన్నా మొత్తం డిపాజిట్ల విలువ రూ.9 లక్షలు దాటకూడదు. నేషనల్ సేవింగ్స్ స్కీమ్ ఏడాదికి 7.7 శాతం వడ్డీని, కిసాన్ వికాస్ పత్రా స్కీమ్ ఏడాదికి 7.5 శాతం వడ్డీని, మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్ ఏడాదికి 7.5 శాతం వడ్డీని, సుకన్య సమృద్ధి యోజన ఏడాదికి 8.2 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నాయి.