ఆసక్తికరంగా 'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని' మూవీ ట్రైలర్..

ఆసక్తికరంగా 'రాకీ ఔర్ రాణి కి  ప్రేమ్ కహాని' మూవీ ట్రైలర్..

రణ్ వీర్ సింగ్ (Ranveer Singh), అలియా భట్(Alia Bhatt) కాంబో లో వస్తున్న లేటెస్ట్ మూవీ రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని(Rocky Aur Rani Kii Prem Kahaani).  ఈ మూవీను కరణ్ జోహార్( Karan Johar)  డైరెక్ట్ చేస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు. కుటుంబ నేపథ్యంతో వస్తున్న ఈ మూవీ ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. 

రణ్ వీర్ ఈ మూవీలో రాఖీ అనే పంజాబీ కుర్రాడిలా.. అలియా రాణి అనే బెంగాళి అమ్మాయిగా కనిపించబోతున్నారు. గొడవతో స్టార్ట్  అయినా రాఖీ, రాణి కాస్తా ప్రేమలో పడినట్లు చూపించారు. ఆ తరువాత వీరి ఫ్యామిలీస్ ను కలపడానికి రాకీ ఇంట్లో రాణి, రాణి ఇంట్లో రాకీ 3 నెలలు ఉండాలని కండీషన్ పెట్టుకున్నట్లు ట్రైలర్ లో చూపించారు. ఇందులో అలియా క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ అదిరిపోయాయి అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ తెలుపుతున్నారు. 

రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని మూవీ ప్లాట్ పాతదే అనిపించినా రణ్ వీర్ సింగ్, అలియా జోడీ ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చేలా ఉన్నారు. ఈ మూవీ లవ్, ఎంటర్టైన్మెంట్, ఎమోషన్ అన్నీ అంశాలను టచ్ చేస్తూ కరణ్ జోహార్ మూవీను తెరకెక్కించినట్లు తెలుస్తోంది.  చాలా కాలం తర్వాత కరణ్ జోహార్ డైరెక్ట్ చేస్తున్న మూవీ కావడంతో అభిమానుల్లో  భారీ అంచనాలే ఉన్నాయి.

ఈ సినిమాలో రణ్ వీర్ సింగ్, అలియా భట్ ఎలక్ట్రిఫైయింగ్ లుక్ లో ఆకర్షిస్తున్నారు. కరణ్ జోహార్ ఇండస్ట్రీకు వచ్చి  25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఈ మూవీ రావడం ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. సిల్వర్ జూబ్లీ జరుపుకుంటున్న కరణ్ జోహార్ ఈ మూవీతో హిట్ కొడుతాడో చూడాలి. 

భారీ తారాగణంతో వస్తున్న ఈ ఫ్యామిలీ డ్రామాలో ధర్మేంద్ర (Dharmendra), జయా బచ్చన్ (Jaya Bachchan)​ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్ ​(Dharma Production) బ్యానర్​లో కరణ్ జోహార్ డైరెక్ట్ చేస్తూ నిర్మిస్తున్నారు.

https://twitter.com/hashtag/RockyAurRaniKiiPremKahaani?src=hashtag_click