ఇస్రోకు భారీగా నిధులు కేటాయింపు

 ఇస్రోకు భారీగా నిధులు కేటాయింపు

బడ్జెట్ లో స్పేస్ డిపార్ట్ మెంట్ కు కేంద్రం ఈసారి రూ.13,042.75 కోట్లు కేటాయించింది. ఇది పోయినేడాదితో పోలిస్తే రూ.498.84 కోట్లు ఎక్కువ. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీకి రూ.16,603.94 కోట్లు కేటాయించారు.

ఇది పోయినేడాదితో పోలిస్తే రూ.242 కోట్లు ఎక్కువ. ఈ మంత్రిత్వ శాఖ కింద మూడు ముఖ్యమైన శాఖలు ఉన్నాయి. వాటిలో సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్ మెంట్ కు రూ.8029.01 కోట్లు, బయోటెక్నాలజీ డిపార్ట్ మెంట్ కు రూ.2,251.52, సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ డిపార్ట్ మెంట్ కు రూ.6,323.41 కోట్లు కేటాయించారు.