
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగుల మీద వచ్చిన అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేసే అత్యున్నత సంస్థ అయిన లోక్‌పాల్‌కు రూ.33.32 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. పోయినేడాది లోక్‌పాల్‌కు మొదటిసారిగా రూ.92 కోట్లు కేటాయించి, ఆపై 110 కోట్లకు సవరించారు. ఈ సారి మధ్యంతర బడ్జెట్లో మాత్రం కోత పెట్టారు. ఈ మొత్తాన్ని లోక్‌పాల్ ఏర్పాటు, తదితర ఖర్చుల కోసం వినియోగించనున్నారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సీవీసీ)కు మధ్యంతర బడ్జెట్లో రూ.51.31 కోట్లు కేటాయించారు.