ఇంటర్ విద్యార్థులకు అలర్ట్

ఇంటర్ విద్యార్థులకు అలర్ట్

జేఈఈ ఎంట్రన్స్ కారణంగా ఇంటర్ పరీక్షల తేదీల్లో మార్పులు చేసిన ఇంటర్ బోర్డు.. కొత్త తేదీలను ప్రకటించింది. తాజా షెడ్యూల్ ప్రకారం.. ఇంటర్ పరీక్షలను మే 6 నుంచి మే 24 వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు సెక్రటరీ తెలిపారు. పరీక్షలను ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు. ప్రాక్టికల్ పరీక్షలను మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకు పెట్టనున్నారు. ఎన్విరాన్ మెంటల్ పరీక్షను ఏప్రిల్ 11, 12 తేదీలలో నిర్వహించనున్నారు.


 

పదో తరగతి పరీక్ష తేదీల్లో మార్పులు

పదో తరగతి పరీక్ష తేదీల్లో మార్పులు  చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మే 23 నుండి జూన్ 1 వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలను నిర్వహించనుంది.  ఇంటర్ పరీక్షల తేదీల మార్పుతో  పదో తరగతి పరీక్షల తేదీలను మార్చింది ప్రభుత్వం. ఇంటర్ ఎగ్జామ్స్   మే 6 నుంచి 24 వరకు జరగనున్నాయి. పరీక్షలను ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహించనున్నారు.