ఇయ్యాల్టి నుంచే ఇంటర్‌‌ ఎగ్జామ్స్‌

ఇయ్యాల్టి నుంచే ఇంటర్‌‌ ఎగ్జామ్స్‌

ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష
ఈ సారీ ‘నిమిషం’ నిబంధన..
స్పెషల్ బస్సులు నడపనున్న ఆర్టీసీ
హాల్ టికెట్లు అందనోళ్లు వెబ్ సైట్ నుంచి తీసుకోవచ్చు

హైదరాబాద్, వెలుగు: ఇంటర్ పబ్లిక్‌‌‌‌ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. 23వ తేదీ వరకు ఎగ్జామ్స్ కొనసాగుతాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రతిరోజు ఒక పరీక్ష జరుగుతుంది. స్టూడెంట్లు నిర్ణీత సమయానికి గంట ముందే ఎగ్జామ్ సెంటర్‌కు చేరుకోవాలని, 8.45కు ఓఎంఆర్ షీట్లు ఇస్తామని అధికారులు చెప్తున్నారు. 9 గంటల తర్వాత ఒక్క
నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించబోమని స్పష్టం చేస్తున్నారు. మొత్తం 9.65 లక్షల మంది హాజరు కానున్నారు. ఇందులో ఫస్టియర్ స్టూడెంట్స్ 4,80,531 మంది, సెకండియర్ స్టూడెంట్స్ 4,85,344 మంది ఉన్నారు. వీరికోసం 1,339 సెంటర్లను ఏర్పాటు చేశారు. పర్యవేక్షణ కోసం 26,964 మంది ఇన్విజిలేటర్లను, 225 మంది స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశారు. కాలేజీ మేనేజ్ మెంట్లు హాల్‌‌‌‌ టికెట్లు ఇవ్వకుంటే ఇంటర్‌‌‌‌ బోర్డు వెబ్‌ సైట్‌‌‌‌ నుంచి డౌన్ లోడ్‌‌‌‌ చేసుకోవాలని అధికారులు సూచించారు. డౌన్‌‌‌‌లోడ్‌‌‌‌ చేసుకున్న హాల్‌‌‌‌ టికెట్లపై ఎవరి సంతకం లేకున్నా .. స్టూడెంట్లను అనుమతించాలని ఇన్విజిలేటర్లను ఇంటర్‌‌‌‌ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ ఆదేశించారు. ప్రతి ఎగ్జామ్ సెంటర్‌లో ఏఎన్ఎం లేదా వైద్య సిబ్బంది ఉంటారని చెప్పారు. స్టూడెంట్ల కోసం ఆర్టీసీ స్పెషల్ బస్సులు నడపనున్నట్లు ప్రకటించింది.

స్టూడెంట్లకు సూచనలు
పరీక్షకు గంట ముందే సెంటర్‌కు చేరుకోవాలి.
ఓఎంఆర్ బార్ కోడెడ్ షీట్‌ను పరిశీలించి, తేదీ, పేరు, ఫొటో, సబ్జెక్ట్… సరి చూసుకోవాలి.
ఏదైనా తప్పు కనిపిస్తే వెంటనే ఇన్విజిలేటర్‌కు చెప్పి, దాన్ని మార్చుకోవాలి.
ఓఎంఆర్ షీట్ పార్ట్‌లో కేటాయించిన బాక్స్‌లో సంతకం చేయాలి.
క్వశ్చన్ పేపర్ పై కేవలం హాల్ టికెట్ నంబర్ మాత్రమే రాయాలి.
ఆన్సర్ షీట్‌లో పేరు, హాల్ టికెట్ నంబర్ రాయొద్దు.
పరీక్షలో బ్లాక్ లేదా బ్లూ ఇంక్ పెన్ను‌లే వాడాలి.
ఆన్సర్ బుక్ లెట్ పై రాయడం పూర్తయిన తర్వాత ‘ది ఎండ్’ అని రాయాలి.