ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో టీఆర్ఎస్ వర్గ విభేదాలు రచ్చకెక్కాయి. టీఆర్ఎస్ పాత నేతలకు.. ఈ మధ్యే పార్టీలో చేరిన కాంగ్రెస్ నేతలకు మధ్య వర్గ పోరు మొదలైంది. మాజీ కార్పొరేటర్ జంగం భాస్కర్‌కి, ఎమ్మెల్యే అనుచరులకు మధ్య సోషల్ మీడియా వార్ నడుస్తోంది. ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డిపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ భాస్కర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో భాస్కర్ కుటుంబ సభ్యులతో కలిసి తుమ్మల నాగేశ్వరరావు అనుచరులు ఆందోళనకు దిగారు. భాస్కర్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. ధర్నాకు దిగిన వారిని పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నం చేయగా.. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. అరెస్ట్‌పై నిలదీసిన భాస్కర్ భార్యపై ఏసీపీ దాడి చేశాడంటూ దళిత సంఘాలు ఫైర్ అవుతున్నాయి. దళిత మహిళతో దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
