
వరంగల్ కాంగ్రెస్ లో మరోసారి వర్గపోరు బయట పడింది. కొండా మురళి వర్గీయులు, నూతన జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ వర్గీయుల మధ్య కొట్లాట జరిగింది. జిల్లా కేంద్రంలోని అబ్నస్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. కార్యకర్తలు చెప్పులతో కొట్టుకున్నారు.
జిల్లా అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన ఎర్రబెల్లి స్వర్ణ.. మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ ఇంటికి వెళ్లి కలువలేదని, ప్రమాణస్వీకారం కార్యక్రమానికి వారిని ఆహ్వానించలేదని కొండా వర్గీయులు ఆందోళనకు దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య పరస్పర వాగ్వాదం చోటుచేసుకుంది. అంతేకాదు సమావేశంలోనే ఇరు వర్గాలు పొట్టపొట్టు కొట్టుకున్నారు. ఈ పరిణామంతో ప్రస్తుతం జిల్లాలో రాజకీయం వెడెక్కింది. కాంగ్రెస్ పార్టీ మళ్లీ గ్రూపు రాజకీయాలు రచ్చకెక్కాయి.