
రామచంద్రాపురం (పటాన్చెరు), వెలుగు : పటాన్చెరు పరిధిలోని గీతం డీమ్డ్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ సైన్స్ ఫిజిక్స్ డిపార్టుమెంట్ ఆధ్వర్యంలో బుధవారం నేషనల్ కాన్ఫరెన్స్ ఘనంగా ప్రారంభమైంది. ‘అడ్వాన్సెస్ ఇన్ కండెన్స్డ్ మ్యాటర్ ఫిజిక్స్’ అనే అశంపై మూడు రోజుల పాటు ఈ జాతీయ సదస్సును నిర్వహించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నిపుణులను ఒకే చోటకు చేర్చి, వినూత్న ఆలోచనలను పంచుకోవడానికి గీతం సదస్సు వేదిక కానుందని కాన్ఫరెన్స్ చైర్ ప్రొఫెసర్ అశోక్ ఛటర్జీ అన్నారు.
అంతర్ విభాగ స్వభావాన్ని ప్రస్తావించడంతో పాటు యువత దీనిని సద్వినియోగం చేసుకోవడం, భవిష్యత్ సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ దత్తాత్రి జెయిస్ కె. నగేషా సూచించారు. ముందుగా కాన్ఫరెన్స్ ప్రొసీడింగ్స్‌ని అతిథులంతా కలిసి విడుదల చేశారు. ఈ సదస్సులో దేశంలోని వివిధ ప్రాంతాల, యూనివర్శిటీల ప్రతినిధులతో పాటు రష్యా, టర్కీ ఇతర దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.