ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పేదరిక నిర్మూలన కోసం తీసుకువచ్చిన సంక్షేమ పథకాల్లో నాడు నేడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతుంది. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం న్యూయార్క్ వేదికగా జరుగుతున్న హై లెవెల్ పొలిటికల్ ఫోరంలో ఆంధ్రప్రదేశ్ లో అమలవుతున్న సంక్షేమ పథకాల స్టాల్ ఏర్పాటు చేశారు స్పెషల్ కన్సల్టేటివ్ స్టేటస్ మెంబర్ ఉన్నవ షకీన్ కుమార్.
ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం న్యూయార్క్ లో జూలై 19వ తేదీ వరకు సుస్థిర అభివృద్ధిపై ఉన్నత స్థాయి రాజకీయ వేదిక కోసం హై లెవెల్ పొలిటికల్ ఫోరం కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ హై లెవెల్ పొలిటికల్ ఫోరంలో 140 దేశాల నుండి ప్రతినిధులు హాజరయ్యారు. స్థిరమైన అభివృద్ధిని సాధించడంలో ఉన్నత విద్య యొక్క కీలక పాత్ర పై అభివృద్ధి చెందుతున్న కార్యాచరణ ఆధారిత సంభాషణ గురించి చర్చించారు. వైసీపీ ప్రభుత్వం విద్యాశాఖలో ప్రవేశపెట్టిన పథకంపై హై లెవెల్ పొలిటికల్ ఫోరంలో నాడు నేడు గురించి చర్చ జరిగిందని షకీన్ కుమార్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న విద్యా బోధన అభ్యాసం ద్వారా బాలికలను అభివృద్ధి చేయుటకు నిర్వహిస్తున్న కీలకమైన నాడు నేడు విద్యా కార్యక్రమాలను ఈ సదస్సులో ముఖ్యంగా ప్రశంసించారు వివిధ దేశాల ప్రతినిధులు. ఆంధ్రప్రదేశ్లో చదువుతున్న బాలికలకు అన్ని రకాల వసతులను నాడు నేడు కార్యక్రమం ద్వారా కల్పిస్తున్నారని ఈ సదస్సులో మాట్లాడారు. ఐక్యరాజ్యసమితి మెంబర్ ఉన్నవ షకీన్ కుమార్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆడపిల్లలు విభిన్న రంగాలలో రాణించాలనేదే ఆయన ముఖ్య ఉద్దేశమని షకీన్ కుమార్ తెలిపారు. నాడు నేడు సంస్కరణల వల్ల ఆంధ్రప్రదేశ్ పాఠశాలల్లో బాలికల నమోదు సంఖ్య చాలా మెరుగుపడిందన్నారు .
ఐక్యరాజ్యసమితి కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్ 1 లో ఏర్పాటుచేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి నాడు నేడు స్టాల్ ద్వారా బాలికల విద్య కోసం అమలు చేస్తున్న పథకాల ప్రయోజనాల వివరాలను ఫ్లకార్డ్స్, ఇమేజ్ బోర్డ్స్, రోలర్ బ్యానర్స్ రూపాలలో ఏర్పాటు చేశారు. వివిధ దేశాల ప్రతినిధులు, ఐక్యరాజ్యసమితి సభ్యులు, విద్యావేత్తలు, ప్రభుత్వ రంగ అధికారులు. ఈ స్టాల్ ను సందర్శించారు. నాడు నేడు పథకం కింద చేపడుతున్న సంస్కరణలను విదేశీ ప్రతినిధులు అడిగి తెలుసుకుని ప్రశంశలు కురిపించారు.
