బేగంపేటలో ఆచార్య నాగార్జునుడిపై అంతర్జాతీయ సెమినార్

బేగంపేటలో ఆచార్య నాగార్జునుడిపై అంతర్జాతీయ సెమినార్

హైదరాబాద్ బేగంపేటలో ఆచార్య నాగార్జునుడుపై అంతర్జాతీయ సెమినార్ నిర్వహించారు. అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య, భూటాన్ సెంట్రల్ మోనిస్ట్రయ్ కార్యదర్శి ఉగ్వేన్ నామ్ గ్వేల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 24 మంది బౌద్ధ ప్రతినిధులతో పాటు రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి  శ్రీనివాస్ గౌడ్  సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భూటాన్ కు చెందిన బౌద్ధ బిక్షువులు తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రత్యేకంగా ప్రార్థన  చేశారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ దిశానిర్దేశంలో భాగంగా ప్రముఖ బౌద్ధ ఆధ్యాత్మిక కేంద్రం, ఆచార్య నాగార్జునుడు నడయాడిన ప్రదేశం నాగార్జున సాగర్ లో బుద్ధవనం ప్రాజెక్టును అంతర్జాతీయ స్థాయిలో నిర్మించామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణలో బుద్ధిజంకు పూర్వ వైభవాన్ని తెచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇప్పటికే అనేక దేశాల నుండి ముఖ్యంగా తైవాన్, ఇండోనేషియా, మంగోలియా, బెంగుళూరుకు చెందిన మహాబోధి సొసైటీకి చెందిన బౌద్ధ సంస్థలు ఆరామాల నిర్మాణం కోసం సంప్రదించాయన్నారు.
 
తెలంగాణలో ఆచార్య నాగార్జునుడు బోధించిన బుద్ధిజం సిద్ధాంతాలు నేడు ప్రపంచంలో అనేక దేశాలలో ఆచరణలో ఉన్నాయని మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. ఆర్థిక సంబంధాలను మెరుగు పరుచుకోవడానికి మైత్రి పూర్వక సంబంధాలను కొనసాగించుటకు భూటాన్ ఆసక్తిగా ఉందన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర బుద్ధవనం ప్రాజెక్ట్ స్పెషల్ ఆఫీసర్ మల్లెపల్లి లక్ష్మయ్య, MD టూరిజం మనోహర్, సుద్దాల సుధాకర్ తేజ, టూరిజం, బుద్ధవనం అధికారులు పాల్గొన్నారు.