- ఆరుగురిని రిమాండ్‌కు పంపిన పోలీసులు
ఓల్డ్‌సిటీ, వెలుగు: రాత్రి వేళలో ఆలయాలు, షాపులను టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్న ముఠాను సౌత్, ఈస్ట్ జోన్, టాస్క్ఫోర్ పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్లో సౌత్ జోన్ డీసీపీ స్నేహ మిశ్రా వివరాలు వెల్లడించారు.
ఐఎస్ సదన్ చౌరస్తాలోని శివాలయంతో పాటు మరో రెండు ఆలయాల్లో ఇటీవల చోరీలు జరిగాయి. దీనిపై కేసు దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను ఏపీకి చెందిన ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం చిన్నపేటకు చెందిన జువ్వల తరుణ్ కుమార్ రాజు(21), దగారపు ఎల్లయాజరు(22), మారుబోయిన మావుళ్లు(22), గండ్ రెడ్డి లోకేశ్(19), కోనాల రజ్జి(18)తో పాటు మరో మైనర్‌గా గుర్తించారు. వీరు ఏపీలో 41 చోరీలకు పాల్పడ్డారు.
ఈ నెల 4న హైదరాబాద్ కు వచ్చి నగర శివారులో రెండు బైకులు, ఐఎస్ సదన్, సరూర్‌నగర్, సైదాబాద్, బేగంబజార్, సుల్తాన్ బజార్ పరిధిలో పలు షాపులు, ఆలయాల్లో చోరీలకు పాల్పడ్డారు. వీరిని ఆదివారం చంపపేట్లో అరెస్టు చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు.
సమావేశంలో టాస్క్ ఫోర్స్ సౌత్ జోన్ అడిషనల్డీసీపీశ్రీనివాస్రావు, సౌత్ ఈస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ కె.శ్రీకాంత్, సంతోష్ నగర్ ఏసీపీ సుఖదేవ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
