మహిళా దినోత్సవం : ఫొటో గ్యాలరీ

మహిళా దినోత్సవం : ఫొటో గ్యాలరీ

1911 నుంచి ప్రపంచంలోని పలు దేశాలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటున్నాయి. సమాజంలో మహిళలపై ఉన్న వివక్ష, అసమానతలను రూపుమాపే దిశగా స్త్రీ శక్తి సంఘటితం కావాలన్న ఆలోచనతోనే మహిళా దినోత్సవం వేడుకలు చేసుకోవడం మొదలైంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని 1975ను ఐక్యరాజ్య సమితి అధికారికంగా గుర్తించింది. లింగ సమానత్వం, సమాన పనికి సమాన వేతనాలు, అన్ని రంగాల్లో మహిళల ప్రాతినిధ్యం లాంటివి సాధించుకునే దిశగా ఈ రోజు మహిళల్లో కొత్త స్ఫూర్తిని నింపుతోంది. యావత్ ప్రపంచం కూడా మహిళలు సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ రంగాల్లో అందిస్తున్న సేవలను ఇవాళ గుర్తు చేసుకుని నారీ శక్తికి సెల్యూట్ చేస్తున్నారు.