అందరూ యోగ డేలో పాల్గొనాలి..

అందరూ యోగ డేలో పాల్గొనాలి..

జులై 21 న జరిగే యోగా డేను పురస్కరించుకుని ముందస్తుగా రామంతాపూర్ పాలిటెక్నిక్ కళాశాలలో యోగ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యోగా మహోత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ యోగా మహోత్సవ్ కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు చేతన,శ్రీవాణి, సినీ నటులు సెల్వరాజ్ అతిధులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఒక మనిషికి ఎంత డబ్బు,పేరు ఉన్నా ఆరోగ్యం చాలా ముఖ్యం కాబట్టి ప్రతీ ఒక్కరు విధిగా రోజులో కొంత సమయం యోగా కు కేటాయించాలని తెలిపారు. జులై 21 యోగ డే సందర్భంగా సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ జరిగే యోగ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సత్యా రెడ్డి,సత్యం గౌడ్,మెహర్ కుషాల్,మధుమాల,మురళీమోహన్, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.