
ఇంటర్నెట్ లో ఎంతో సమాచారం ఉందని… దానిని సరిగా వినియోగించుకుంటే అద్భుతాలు చేయొచ్చని చెప్పారు సివిల్స్ టాప్ థర్డ్ ర్యాంకర్ జునైద్ అహ్మద్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ …సివిల్ సర్వీసెస్ 2018 ఫైనల్ ఫలితాలను నిన్న విడుదల చేసింది. ఫలితాలను upsc.gov.in వెబ్ సైట్ లో పెట్టింది.
ఉత్తర్ ప్రదేశ్ లోని బిజ్నోర్ జిల్లా నగినాకు చెందిన జునైద్ అహ్మద్.. ఫరీదాబాద్ లో IRS ట్రైనింగ్ తీసుకుంటూ ఈసారి సివిల్స్ లో టాప్ 3 ర్యాంక్ సంపాదించాడు. లాస్టియర్ 352 ర్యాంక్ రావడంతో.. ఉద్యోగం చేస్తూనే… ఈసారి మరింత పట్టుదలగా చదివాననీ.. రోజుకు ఐదారు గంటల పాటు చదివి మెరుగైన ర్యాంక్ కొట్టానని చెప్పారు.
పుస్తకాలు ఎవరికైనా బేస్ నాలెడ్జ్ ఇస్తాయని … పూర్తి స్థాయి, విస్తృతస్థాయి సమాచారం ప్రస్తుతం ఇంటర్నెట్ లోనే అందుబాటులో ఉందని అన్నారు జునైద్. “ఇంటర్నెట్ నిజానికి చాలా పనికొస్తుంది. కానీ చాలామంది దానిని సరైన పద్ధతిలో వినియోగించుకోవడం లేదు. సమాచార సేకరణలో ఇంటర్నెట్ ను మించింది మరోటి లేదు. మెరుగైన ర్యాంక్ వస్తుందనుకున్నా కానీ … థర్డ్ ర్యాంక్ సంపాదిస్తానని అనుకోలేదు” అన్నారు జునైద్ అహ్మద్.