నీరవ్ మోడీ భార్యపై ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ

V6 Velugu Posted on Aug 25, 2020

పంజాబ్ నేషనల్ బ్యాంకు (PNB) కు వేల కోట్ల రూపాయల టోకరా వేసి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోడీ ప్రస్తుతం యూకే జైల్లో ఉన్నాడు. మరోవైపు ఆయన భార్య అమీ మోడీపై లేటెస్టుగా ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది. నీరవ్ మోడీ పైనా, ఆయన భార్య అమీపైనా భారత్ లో మనీలాండరింగ్ కు పాల్పడినట్టు ఈడీ కేసులు నమోదు చేసింది. వారిపై సీబీఐ కేసులు కూడా ఉన్నాయి. ఈడీ, సీబీఐ కేసులుండటంతో అమీపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. ఇక ఆమె ఏ దేశంలో ఉన్నా అరెస్ట్ చేసే అవకాశముంది.

Tagged Wife, Nirav Modi, Interpol, money laundering cases, Red Corner Notice

Latest Videos

Subscribe Now

More News