నిజామాబాద్ రూరల్ లో అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్

నిజామాబాద్ రూరల్ లో  అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్

నిజామాబాద్ రూరల్, వెలుగు : గంజాయి విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను మోపాల్​ పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం నిజామాబాద్​ రూరల్​ సౌత్​ సీఐ సురేశ్​కుమార్ మీడియాకు వివరాలు వెల్లడించారు.  మోపాల్​ మండలం కంజర్​ గ్రామ శివారులో కొంతమంది గంజాయి విక్రయిస్తున్నారని  సమాచారం రావడంతో ఎస్సై సుస్మిత దాడి చేసి అమీర్​ఖాన్, షేక్​అఫ్రోజ్​, శివ లను అదుపులోకి తీసుకున్నారని తెలిపారు.  

నిజామాబాద్​ నుంచి నాందేడ్​కు వెళ్లి   రూ.10వేలకు కిలో గంజాయి చొప్పున తీసుకొచ్చి 5 గ్రాముల ప్యాకెట్లుగా తయారు చేసి రూ.200 నుంచి 300లకు అమ్ముతున్నారని తెలిపారు. నిందితులను శుక్రవారం అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి 1.2కిలోల గంజాయి, మూడు సెల్​ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.